ఏపూరి సోమన్న ఆ పార్టీలో చేరబోతున్నారా..?

ప్రజా యుద్ధ నౌక గద్దర్( GADDAR ) తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న.

ఆటపాటలతో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కేసీఆర్ సర్కారుపై ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక పాటలు రాసి తన గళాన్ని వినిపించారు.

ఇక రేవంత్ రెడ్డి( REVANTH REDDY ) టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, షర్మిల( YS.

SHARMILA ) కొత్త పార్టీ పెట్టిన సమయంలో షర్మిల వెంట తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

అలాంటి ఏపూరి సోమన్న కేవలం ఆటపాటలు, పోరాట మార్గం ద్వారా బహుజన జాతులకు న్యాయం జరగదని, చట్టసభల్లో అడుగు పెడితేనే బహుజన జాతులు బాగుపడతాయని భావించారు.

ఈ తరుణంలోనే ఆయన ఆ జాతీయ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. """/" / ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం వెలిశాల గ్రామానికి చెందిన ఏపూరి సోమన్నకు( SOMANNA ) తెలంగాణ ప్రభుత్వం కళాకారుల విభాగం నుంచి ఒక ఉద్యోగం కల్పించింది.

కానీ సోమన్న ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రభుత్వం పైన తిరుగుబాటు బాగుటా ఎగరవేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్( CONGRESS ) పార్టీలో చేరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల్లో ఎండగట్టారు.

అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత వైయస్సార్ షర్మిల పార్టీలో చేరారు.

"""/" / కానీ తాజాగా వైఎస్ఆర్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది.

ఈ తరుణంలోనే కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన ఏపూరి సోమన్న రాజకీయ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది.

అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలో పిడమర్తి రవి( RAVI PIDAMARTHI ) టికెట్ ఆశిస్తున్నారు.

అలాగే ఏపూరి సోమన్న కూడా ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి తుంగతుర్తి టికెట్ కాంగ్రెస్( CONGRESS ) తరపున తీసుకొని ఎలాగైనా ఎలక్షన్స్ లో గెలవాలనే ప్రయత్నంతో ఆయన ఉన్నారు.

మరోవైపు పిడమర్తి రవి సపోర్టుతో ఇప్పటికే ఈ పార్టీలో చేరారు.ఇద్దరు ఉద్యమ నేతలే కాబట్టి మరి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

ఓరి దేవుడా.. సిటీ స్కాన్ రిపోర్టు చూసి అబ్బురపోయిన డాక్టర్లు..