ద్వారకాతిరుమల నుంచి దుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులను పురస్కరించుకొని.ద్వారకాతిరుమల ఈవో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ద్వారకా తిరుమల నుంచి అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.

ఈ నేపథ్యంలో దుర్గమ్మకు పట్టు వస్త్రాలు తీసుకురావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.

గతంలో అమ్మవారి సన్నిధిలో ఈవోగా పనిచేశానన్న ఆయన స్వామివారు, అమ్మవారి దర్శనం అయితేనే చాలు అనుకునే వాళ్ళమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ద్వారకా తిరుమల ఆలయ చైర్మన్ సుధాకర్ రావు ,ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్