అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా చూడాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం, పథకాలు అర్హులకు అందేలా తెలియజేయడానికి రూపొందించిన కార్యక్రమమే వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర అని కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి , వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జిల్లా ఇంఛార్జి అజయ్ గుప్తా తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఈ నెల 16 వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 26 వరకూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టనున్న 'విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ నిర్వహణ పై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సమీక్షించారు.

కార్యక్రమం ప్రభావవంతంగా చేపట్టేందుకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అజయ్ గుప్తా మాట్లాడుతూ.

కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారనీ చెప్పారు.

ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించడం, ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోవాలన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా టెక్స్టైల్ , వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన జిల్లాగా ఉన్నందున ఈ రంగాలలో స్టార్టప్ కంపెనీల స్థాపనకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ.అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రారంభించినందున, లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు.

రెండో దఫా పర్యటనలో క్షేత్ర స్థాయిలోనే 'విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ కార్యకలాపాలకు , పథకాల అమలును పరిశీలిస్తానని ఆయన తెలిపారు.

లబ్దిదారులతో స్వయంగా మాట్లాడుతానని చెప్పారు.కలెక్టర్‌ అనురాగ్ జయంతి మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల ప్రచార వాహనాలను జిల్లాలోని గ్రామ గ్రామాన, పంచాయతీలు, మునిసిపాలిటీలు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా సుమారు 40 రోజుల పాటు ప్రచార వాహనాలు జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించామని వివరించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో 'విక్‌సిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’ సక్సెస్ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంతున్నట్లు కలెక్టర్ సంయుక్త కార్యదర్శి కి తెలిపారు.

ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కేంద్ర ప్రభుత్వ సౌజన్యం తో అమలవుతున్న పథకాల తాజా ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, డి ఆర్ డి ఓ నక్క శ్రీనివాస్, ఎల్ డి ఎం మల్లిఖార్జున్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అంత అసహనం ఎందుకు ? రేవంత్ కు కేటీఆర్ కౌంటర్