వాడుక బాషా సినిమా పై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా ?

ఒక్కోసారి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పక్క భాషలను తెచ్చి మన భాషలో కలిపేసి వాటి అర్దాలను మార్చేసి సరి కొత్త పేర్లు పెట్టడం మనవారికి బాగా అలవాటే.

అయితే మనం అనుకున్నదే నిజమని కొన్నేళ్లుగా నమ్ముతూ వస్తున్నాం.ఆలా నమ్మిన దాన్ని మన భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాం.

తరాలుగా తప్పులను నెమరవేస్తూ అదే నిజమని ప్రచారం చేస్తున్నాం.అందులో ఇంగ్లీష్ బాషా అయితే మరి ఎక్కువ.

తెలుగు సినిమాల విషయానికి వచ్చే సరికి ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం పరిపాటే.అయితే పెడుతున్న టైటిల్ లో నిజ నిర్దారణ అయితే జరగడం లేదు.

అందుకు ఒక ఉదాహరణ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.జూనియర్ ఎన్టీఆర్ హీరో గా వచ్చిన జనతా గ్యారేజి సినిమా మీకు అందరికి గుర్తు ఉండే ఉంటుంది.

ఈ సినిమా కు రెండు జాతీయ అవార్డులు దక్కాయి.కాగా ఈ అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీ లో జరుగుతుంది.

సాధారణంగా అవార్డు అందుకునే వారి కి ఆహ్వానం వచ్చాక స్టేజి పై క్యాటగిరి పేరు అలాగే అవార్డు గ్రహీత పేరు, ఈ సినిమాకు సదరు అవార్డు లభించిందో ఆ సినిమా పేరు మరియు అది ఏ బాషా లో నిర్మాణం జరుపుకుందో చెప్తూ ఉండగా, సదరు గ్రహీత ఆ పురస్కారం అందుకోవడానికి మన దేశ రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి అందుకుంటారు.

ఇలా ఈ కార్యక్రమం జరుగుతుంది.ఇక జనతా గ్యారేజి సినిమాకు గాను అవార్డు అంనౌన్స్మెంట్ తో పాటు మిగతా డీటెయిల్స్ కూడా చెప్తూ స్టేజి పైకి పిలిచారు.

"""/"/ హోస్ట్ చేస్తున్న వ్యక్తి జనతా గ్యారేజ్ సినిమాను జనతా గరాజ్ అంటూ పలికారు.

టీవీల్లో ఆ ప్రోగ్రాం ని చూస్తున్న వారు ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయ్యే ఉంటారు.

సినిమా పేరు తప్పుగా ఎందుకు పలికారు అని.ఆ తర్వాత అసలు విషయం ఎంత అని పరిశీలిస్తే గ్యారేజ్ అనే పదం అసలు లేదట.

దానిని గరాజ్ అనే పలకాలాట.చాల ఏళ్లుగా గ్యారేజ్ అని పదం చెప్పి చెప్పి దాన్ని సినిమాకు టైటిల్ గా కూడా వాడేశాం.

ఇక ఇప్పుడు గరాజ్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు.ఇక ఇలా మనం మార్చేసిన అనేక గమ్మత్తయిన పదాలు ఉన్నాయ్.

ఫుడ్ ని ఫూడ్ అనాలంట.క్యాస్ట్ అనే పదాన్ని కాస్ట్ అని పిలవాలట.

ఇలా తీస్తూ వెళ్తే బోలెడు పదాలు మనం తప్పుగా పలుకుతున్నాం.

బన్నీ అరెస్ట్ అయితే జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నారా.. ఆయన రియాక్షన్ ఏంటంటే?