ఆంగ్ల టీచర్ మెడికల్ లీవ్…దాతల సహకారంతో ప్రైవేట్ టీచర్
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయుడు మెడికల్ లాంగ్ లీవ్ పై వెళ్ళడంతో విద్యార్దులు ఇబ్బంది పడడంతో తల్లితండ్రులు, గ్రామస్తులు అధికారులకు కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో హైస్కూల్ హెడ్మాస్టర్ గఫర్ ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఆంగ్ల టీచర్ ను ఏర్పాటు చేయడానికి దాతల సహకారం కోరగా వేతనం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావడంతో పాఠశాల ఉపాధ్యాయులు కూడా మేము సైతం అన్నారు.
ఎట్టకేలకు ఆంగ్ల టీచర్ పోస్ట్ భర్తీ కావడంతో విద్యార్దులు ఆనందం వ్యక్తం చేశారు.
బుధవారం దాతలను పాఠశాలలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు,విద్యార్ధులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా హెడ్మాస్టర్ గఫర్ మాట్లడుతూ ప్రభుత్వ పాఠశాలలకు దాతల సహకారం అవసరమని,విద్యార్ధులను ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు మా పాఠశాల బృందం నిరంతరం శ్రమిస్తూనే ఉంటామన్నారు.
గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని,వారి బాధ్యత మేము తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
దాతలు మాట్లడుతూ మా గ్రామ పాఠశాల అభివృద్ధి చేసుకోవడం మా బాధ్యతని అన్నారు.
దాతలకు గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో గ్రామస్తులు జోరుక ఎల్లెష్,గుర్రాల రవి,నీల రాజు,అలకుంట్ల శేఖర్, దేవరాజు సిద్దిరాములు, అన్నెబోయిన నాగయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు,ఉపాధ్యయులు నరసింహరెడ్డి,జైనుల్లఉద్దీన్,మంజుల,పుష్పలత, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన దాతల వివరాలు.గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ పిసరి ప్రశాంత్ రెడ్డి వారి తాత పిసరి మాధవరెడ్డి జ్ఞాపకార్థం రెండు నెలల వేతనం,ప్రతీ సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విధ్యార్థులకు పదివేల నగదు బహుమతి ఇవ్వడానికి ముందుకు రాగా,గ్రామపెద్దలు చాడ శశిధర్ రెడ్డి వారి సోదరుడు శ్రీధర్ రెడ్డి జ్ఞాపకార్ధంగా ఒక నెల వేతనం,వాస బ్రదర్స్ రాజేష్,ఉపేందర్ వారి తాత క్షత్రయ్య జ్ఞాపకార్ధం రెండు నెలల వేతనం, పాఠశాల హెడ్మాస్టర్ గఫర్ ఒక నెల వేతనం, ఉపాధ్యాయులు నర్సింహా రెడ్డి ఒక నెల వేతనం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
అలాగే ఆగస్టు 15 న ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడానికి గ్రామస్తుడు కంచర్ల బీరప్ప, గతంలో పాఠశాల ప్రహరీ గోడ మరమ్మత్తు కోసం గ్రామ యువకుడు ఎరుకలి ఉపేందర్ కూడా సహకారం అందించారు.
అక్కడ ఉన్నది తరగతి గదా లేక స్పా సెంటరా? విద్యార్థులతో ఆ టీచర్ ఏకంగా