ఈఎల్ టిఏ , చేయూత మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ ఒలంపియాడ్, ఉపన్యాస పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల చేయూత మిత్ర ఫౌండేషన్, ఈ ఎల్ టి ఏ ఆధ్వర్యంలో మండల స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ పరీక్ష, ఉపన్యాసం పోటీలను శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.

ఈ పరీక్షలో మొదటి బహుమతి వి.సాయి సహస్ర (9వ తరగతి ) జడ్.

పి.హెచ్.

ఎస్ రాచర్ల గొల్లపల్లి)1000 రు నగదు, మెమోంటో,రెండవ బహుమతి ఎండీ .అయేషా సిద్ధికి 500 రు,మెమెంటో(9వ తరగతి, జడ్.

పి.హెచ్.

ఎస్ ఎల్లారెడ్డిపేట ),మూడవ బహుమతి వి .సిరిచందన 250 రు,మెమెంటో (8వ తరగతి, జడ్.

పి.హెచ్.

ఎస్ రాచర్ల బొప్పాపూర్ గెలుపొందిన విద్యార్థులకు అందించారు.ఈ కార్యక్రమంలో చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు ఎండీ బాబా,కదిరే రవి, బాధ గోపి, ప్రధానోపాధ్యాయులు శ్రీ మనోహర చారి ,వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి7, మంగళవారం 2025