అచ్చ తెలుగులో మాట్లాడుతున్న న్యూజిలాండ్ వాసి,వైరల్ అవుతున్న వీడియో

మన మాతృ భాషను స్పష్టంగా మనం మాట్లాడడానికే తెగ ఇబ్బంది పడుతుంటాం.కొత్త కొత్త పోకడలకు పోయి ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాలి అంటూ తెగ తపన పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడాల్సిందే.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారా.

కనీసం ఒక్క పదం కూడా మన భాష గురించి తెలియని ఒక న్యూజిలాండ్ వాసి అచ్చ తెలుగులో ఎంతో స్పష్టంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు.

అతడు మాట్లాడిన ఆ కాసేపు కూడా ఎంతో ఏకాగ్రత తో ఎక్కడా కూడా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా మాట్లాడ్డం విశేషం.

ఎదో ఫుడ్ కోర్ట్ లో పనిచేస్తున్న అతడు అక్కడకు వచ్చిన తెలుగు వారితో నాకు తెలుగు వచ్చు తెలుగులో చెప్పండి అంటూ పలకరించి మరీ వారితో చక్కగా తెలుగు లో మాట్లాడాడు.

మీకు తెలుగు ఎలా వచ్చింది అని వారు అడుగగా ఆ ఇంగ్లిష్ కుర్రాడు రెండు సంవత్సరాలు ఆంధ్ర లోని విజయవాడలో ఉన్నాను అప్పుడు తెలుగు నేర్చుకున్నాను అంటూ సమాధానం చెప్పాడు.

నిజంగా ఈ రోజుల్లో పిల్లలు సైతం తల్లి దండ్రులతో ఇంగ్లిష్ లోనే మాట్లాడాలి అని ఫోర్స్ చేసి మరి పిల్లలకు ఇంగ్లిష్ నేర్పుతున్నారు కానీ, ఎవ్వరూ కూడా తమ తమ మాతృ భాష పై మాత్రం ఎలాంటి శ్రద్ద చూపడం లేదు.

అలాంటి వారు ఈ వీడియో ను చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే.మరోపక్క ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియో లో ఆ విదేశీయుడు తెలుగు మాట్లాడుతుంటే, విని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌ గెలిస్తే .. ఎలాన్ మస్క్ ఆయనకు సలహాదారుడు కానున్నారా .?