హిస్టరీ రిపీట్: పట్టపగలే నెదర్లాండ్స్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్స్..!
TeluguStop.com
అవును.ఇంగ్లాండ్ జట్టు చెలరేగిపోయింది.
నెదర్లాండ్స్‌కు పట్టపగలే చుక్కలు చూపించారు.ఎలాగని అనుకుంటున్నారా? ఇంగ్లాండు బ్యాటర్స్ తమ బ్యాట్స్ తో నెదర్లాండ్స్ బంతులతో ఆడుకున్నారు.
వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసింది.
మొత్తం 498 పరుగులు చేయగా.3 సెంచరీలు, 2 డజన్లకు పైగా సిక్సర్లుతో చెలరేగిపోయారు.
ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయగా, ఒక బ్యాట్స్‌మెన్ యాభై పరుగులు చేశాడు.ఫలితంగా ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.
ఇక్కడ ఇంగ్లాండ్ 4 వికెట్లకు 498 పరుగులు చేయడమే ఓ అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు.
దాంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది.ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, అంతకుముందు 481 పరుగుల రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిట ఉండటం విశేషం.
అలాగే వన్డేల్లో 2వ ఫాస్టెస్ట్ 150.జోస్ బట్లర్ 65 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసి, రికార్డులకెక్కాడు.
AB డివిలియర్స్ 2015లో 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు.లివింగ్‌స్టోన్ వన్డేల్లో రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.
ఇంగ్లండ్ తరపున లియామ్ లివింగ్‌స్టోన్ 17 బంతుల్లో 50 సాధించాడు.అలాగే దీనిని వన్డే క్రికెట్‌లో ఇది రెండో ఫాస్టెస్ట్ అర్ధశతకంగా పరిగణించవచ్చు.
"""/"/
ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కూడా ఈ ఆటలోనే నమోదు కావడం గమనార్హం.
ఇంగ్లండ్ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 26 సిక్సర్లు నమోదు చేసింది.వన్డే క్రికెట్‌లో ఇదే రికార్డు అని చెప్పుకోవచ్చు.
ఇంతకుముందు కూడా ఈ రికార్డు ఇంగ్లాండు జట్టు పేరిటే ఉండటం కొసమెరుపు.2019 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై జట్టు 25 సిక్సర్లు బాదటం అప్పట్లో హిస్టరీ అనుకోవచ్చు.
ఇప్పుడు మరలా ఈ ఇంగ్లీష్ జట్టు హిస్టరీ రిపీట్ చేసింది.ఇకపోతే ఈ ఇన్నింగ్స్ తో మొత్తం పురుషుల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 19వ ఆటగాడిగా డేవిడ్ మలన్ నిలిచాడు.
వీల్ చైర్ కోసం 10 వేల ఫీజు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఎన్ఆర్ఐకి చేదు అనుభవం