రైలు పట్టాలపై పార్టీ చేసుకున్న విద్యార్థులు, రైలు వచ్చి దారుణం జరిగింది

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఒక ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ చదువుతున్న అయిదుగురు కుర్రాళ్లు పార్టీ చేసుకోవాలనుకున్నారు.

బీరు బాటిల్స్‌ మరియు కొన్ని చిప్స్‌ ప్యాకెట్స్‌ తీసుకుని శివారులో ఉన్న రౌతల్‌ పాలం రైల్‌ ఓవర్‌ బ్రిడ్జీ వద్దకు చేరుకున్నారు.

జనాలు లేని ప్రాంతంలో వారు పార్టీ చేసుకోవాలని భావించారు.అందుకోసం వారు రైలు పట్టాలను ఎంపిక చేసుకున్నాడు.

రైలు ఈ సమయంలో ఏమీ రావనుకున్న వారు మద్యం తాగుతూ ఉన్నారు.మద్యం తాగిన మత్తులో ఉన్న వారికి రైలు వచ్చేది తెలియలేదు.

అయిదుగురిలో రైలు దగ్గరకు వచ్చే వరకు గుర్తించక పోవడంతో రైలు కింద పడిపోయారు.

కాని ఒక్కడు మాత్రం రైలు దగ్గరకు వచ్చే సమయంలో తప్పుకున్నాడు.అతడు ప్రాణాలతో మిగలగా మరో నలుగురు మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు గుర్తించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.రైలు పట్టాలపై పార్టీలు చేసుకోవడం ఏంటీ అంటూ స్థానికులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాల మీదకు తెచ్చుకునే ఇలాంటి పార్టీలు పనులు ఇప్పటికైనా మానేయాలంటూ స్థానిక యువతకు పెద్ద వారు చెబుతున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters