హైదరాబాద్ లో తీరని పెట్రోల్ కష్టాలు..!!

హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఇంకా పెట్రోల్ కష్టాలు తీరలేదు.బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు.

నగరంలోని పలు పెట్రోల్ బంకుల( Petrol Stations ) వద్ద ఇంకా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నారు.

అదేవిధంగా పలు బంకుల వద్ద పెట్రోల్ కోసం బారులు తీరారు.లారీ, ట్రక్కు యజమానుల సమ్మె( Truckers Strike )ను విరమించిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి పెట్రోల్ ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి.

అయినప్పటికీ నగరంలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారుల రద్దీ కొనసాగుతోంది.ఈ క్రమంలో కావాల్సినంత స్టాక్ ఉందని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

గుండె జబ్బులకు దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ గింజలను తప్పక తీసుకోండి!