అంతరించిపోతున్న నాటకరంగం, కళాకారులను గుర్తుతెచ్చే ఉత్సవం !!
TeluguStop.com
నాటకాలు అనే పదం గురించి పరిచయం అక్కర్లేదు.కానీ సురభి నాటకాలు, నాటక కళాకారులు వారి బ్రతుకులు, బాధలు, గాధలు అంతరించిపోతున్న నాటక కళా రంగం గురించి పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం ఉత్సవం.
డైరెక్టర్ అర్జున్ సాయి ఈ నాటక రంగం నాటక కళాకారుల గురించి ఎంతో గొప్ప గొప్ప ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులతో పని చేశారు.
ఎక్కడా ప్రొడక్షన్ వాల్యూస్ రాజీ పడకుండా సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది.
త్వరలో ప్రమోషన్స్ మొదలు కాబోతున్న ఈ ఉత్సవం సినిమాలో హీరోగా దిలీప్ హీరోయిన్ గా రెజీనా నటించారు.
ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రచ్చ రవి, రఘుబాబు, ప్రియదర్శి తదితరులు నటించారు.
అద్భుతమైన విజువల్స్ ను కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ ఉత్సవం ను అందంగా తీర్చిందిద్దారు, అనూప్ రూబెన్స్ తన పాటలతో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోశారు.
కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ లో నెక్స్ట్ లెవెల్ చేశారు.ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి సెట్స్ అద్భుతంగా ఉంటాయి.
ఉత్సవం మరిచిపోతున్న, మరిచిపోయిన నాటకరంగం గురించి కళాకారుల గురించి వస్తున్న సినిమా.త్వరలో ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కానుంది.
నటీనటులు:
దిలీప్ ప్రకాష్, రెజీనా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్రప్రసాద్, అలీ, రఘుబాబు, ప్రేమ, ఎల్.
బ్రహ్మాజీ, రచ్చ రవి, ప్రియదర్శి తదితరులు.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?