ఛత్తీస్‎గఢ్‎లో ఎన్‎కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

ఛత్తీస్‎గఢ్‎లో ఎన్‎కౌంటర్ కలకలం సృష్టించింది.బీజాపూర్ లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.మృతుల్లో ఒక మహిళా మావోయిస్టు ఉన్నట్లు గుర్తించారు.

పొప్రా అడవులలో భద్రతాబలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.దీంతో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

అనంతరం ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.కాగా శుక్రవారం సాయంత్రం నుంచి సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

వీడియో: పాడుబడిన ఇంట్లో వెతుకుతుంటే ఊహించని ట్విస్ట్.. గోడల్లో నిధి చూసి షాక్!