మునగాల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వెలవెల…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: మునగాల మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యలక బిందు అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు గైర్హాజరుతో ఖాళీ కుర్చీలతో వెలవెల బోయింది.
అధికారుల,ప్రజాప్రతినిధులు తీరుపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్వసభ్య సమావేశానికి హాజరు కాకుండా,ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేయాలని,నాణ్యమైన భోజనాన్ని అందించాలి సూచించారు.
పుష్పరాజ్ లాంటి వ్యక్తులు బయట కూడా ఉన్నారు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!