ఫన్నీ వీడియో: ఆఫీస్‌లో ఉన్నానని మర్చిపోయి.. మమ్మీ చాయ్ అంటూ అరిచిన ఉద్యోగి..

కరోనా తర్వాత చాలామంది ఇంటి నుంచే వర్క్ చేయడం స్టార్ట్ చేశారు.ఇప్పటికీ చాలామంది వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు.

కొందరు మాత్రం తిరిగి ఆఫీసర్ కి వెళ్తున్నారు.అయితే చాలా కాలంగా ఇంటి మంచి పని చేయడంతో వారికి వర్క్ ఫ్రమ్‌ హోమ్ బాగా అలవాటు అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఒక ఉద్యోగి తాను ఆఫీస్‌లో ఉన్నానన్న విషయం మరిచి ఇంట్లో నుంచే పని చేస్తున్నానని అనుకుని 'మమ్మీ.

చాయ్' అంటూ గట్టిగా అరిచాడు.దీంతో ఆఫీస్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్ద ఆఫీసులో ఒక ఉద్యోగి కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం చూడవచ్చు.

అతడు ఒకేసారి మమ్మీ.చాయ్ అంటూ అరవడం కూడా మీరు వినవచ్చు.

దీనితో సహోద్యోగులు అందరూ కూడా బిత్తరపోయి చూసారు.ఆ తర్వాత సదరు ఉద్యోగి తాను ఇంట్లో కాదు ఆఫీసులో ఉన్నాను అని తెలుసుకునే బిక్కమొహం వేశాడు.

బహుశా ఈ ఉద్యోగి ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నప్పుడు టీ కోసం తన తల్లిని అలాగే అరిచి అడిగే వాడేమో.

అదే అలవాటు అయి ఇప్పుడు ఆఫీస్ లో కూడా అరిచేశాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ వీడియోకి వేలల్లో వ్యూస్, లైక్స్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

రామ్ చరణ్ బుచ్చిబాబు ఈ సినిమాలో కీలకపాత్ర వహిస్తున్న సీనియర్ హీరో…