ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం: మంత్రి బొత్స

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ప్రజాస్వామ్యంలో ఉద్యమం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు.

కానీ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్న మంత్రి.

ఆ అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.ఉపాధ్యాయులపై పెట్టిన కేసుల విషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఉద్యోగుల పట్ల ప్రభుత్వం పూర్తిగా అనుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.