పనులు పక్కన పెట్టి టిక్ టాక్ లో వీడియోలు చేస్తున్న మున్సిపల్ ఉద్యోగులు

ఈ మధ్య కాలంలో జనం టిక్ టాక్ కి విపరీతంగా అలవాటు పడిపోయారు.

ఈ టిక్ టాక్ వ్యామోసంలో అన్ని పనులు వదిలేసి దానిలోనే కాలక్షేపం చేస్తున్నారు.

టిక్ టాక్ వీడియోలు చేస్తూ కొంత మంది ఊహించని విధంగా ఫేమస్ అయిపోతున్నారు.

ఈ కారణంగా అందరూ తన టాలెంట్ ని టిక్ టాక్ లో చూపిస్తూ ఫేమస్ అవ్వాలనే ప్రయత్నం, అలాగే టిక్ టాక్ వీడియో లు చేస్తూ ముచ్చట తీర్చుకోవాలనే ఆనందం వెరసి దానికి బానిసగా మారిపోతున్నారు.

ఆ మధ్య ఓ హాస్పిటల్ లో నర్స్ లు పేషెంట్ లని వదిలేసి టిక్ టాక్ వీడియోలో మునిగిపోవడం సంచలనంగా మారడం వారిని ఉద్యోగాలలోంచి తొలగించడం జరిగింది.

ఇప్పుడు అలాంటి ఘటన ఖమ్మం కార్పొరేషన్‌లో చోటు చేసుకుంది.కార్పోరేషన్ లో పని చేస్తున్న ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి టిక్‌ టాక్‌లో టాలెంట్‌ చూపిస్తున్నారు.

డ్యాన్సులు, డైలాగ్‌లతో టికెటాక్‌ యాప్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.గతంలో ఇదే పంథాలో చేసి దొరికితే కమిషనర్‌ కొందరిని హెచ్చరించారు.

మరికొందరికి నోటీసులు ఇచ్చిన అక్కడి సిబ్బంది వైఖరిలో మార్పు కనిపించడం లేదు.ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారినప్పటి నుంచి ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికార యంత్రాంగంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తు ఉంటే అక్కడి ఉద్యోగ సిబ్బంది మాత్రం పనులు గాలికి వదిలేసి ఇలా టిక్ టాక్ వీడియోలతో కాలక్షేపం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిన్ను వదిలేదే లేదు… మరోసారి విజయ్ దేవరకొండ అని గెలికిన అనసూయ?