పిడిపై హెచ్ఆర్సీలో ఉద్యోగి ఫిర్యాదు
TeluguStop.com
డిఆర్డీఏ పిడి వేధింపుల తాళలేక హెచ్ఆర్సీని ఆశ్రయించిన మహిళా ఉద్యోగి.రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన టెక్నికల్ అసిస్టెంట్.
ఆరోగ్యం కుదుట పడ్డాక విధుల్లో చేరితే పిడి వేధింపులు.అకారణంగా నల్లగొండ నుండి తిప్పర్తికి బదిలీ.
తిరిగి నల్లగొండకు ట్రాన్స్ఫర్ అడిగితే రూ.50 వేలు డిమాండ్.
నల్లగొండ జిల్లా:డీఆర్డీఏ పీడీ వేధింపులు భరించలేక ఓ మహిళా టెక్నికల్ అసిస్టెంట్ హెచ్ఆర్సీని ఆశ్రయించిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో విజయ అనే మహిళా ఉద్యోగి గత పదేళ్లుగా టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తుంది.
సదరు ఉద్యోగి 2011లో విధులకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్ళింది.
అనంతరం ఆరోగ్యం కుదట పడ్డాక తిరిగి విధులకు హాజరవుతుంది.ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఆసుపత్రికి వెళ్లాలని డీఆర్డీఏ పీడీ కాళిందని సెలవు అడిగితే డ్యూటీ చేస్తే చేయ్ లేదంటే మానేయ్ అంటూ దురుసు సమాధానం చెబుతూ వేధింపులకు గురిచేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది.
పిడీ తనపై కక్ష్య సాధింపు చర్యగా నల్లగొండ జిల్లా కేంద్రం ప్రధాన కార్యాలయం నుంచి తప్పర్తి మండలానికి అకారణంగా బదిలీ చేసిందని వాపోయింది.
తాను నల్లగొండలో నివసిస్తున్నానని,ఆరోగ్యం బాగోలేదని ఎన్నిసార్లు ట్రాన్స్పర్ అడిగినా వేధిపులకు గురిచేస్తోందని,బదిలీ కావాలంటే రూ.
50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించింది.వారి సామాజిక వర్గానికి చెందిన కొంతమందికి సెలవులైనా,బదిలీలైనా నిమిషాల్లో పనులు జరిగిపోతాయని,తనకు మాత్రం సెలవు అడిగినా,బదిలీ అడిగినా వేధింపులేనని,పీడీ వేధింపులు తట్టుకోలేకనే హెచ్ఆర్సీని ఆశ్రయించినట్లు చెప్పింది.
డీఆర్డీఏ పీడీ కాళిందని వేధింపులకు విసిగివేసారి,తనకు న్యాయం చేయాలని శుక్రవారం హైదరాబాద్ లోని హ్యూమన్ రైట్ కమిషన్ ను ఆశ్రయించి,కమిషన్ సభ్యులకు తన పరిస్థితిని,పీడీ వేధింపులను వివరించినట్లు చెప్పింది.
13 ఏళ్లకే సన్యాసినిగా మారిన బాలిక.. కుంభమేళాలో ఈ ఘటనపై మీరేమంటారు..