వైరల్: ఎమోషనల్ వీడియో... చంటి పిల్లాడిని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి!

సోషల్ మీడియా పరిధి విస్తరించడంతో దేశంలో జరుగుతున్న అనేక రకాల విషయాలను ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.

తాజాగా ఓ బాధ్యతగల ఓ తండ్రి వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లను పలకరించింది.

అది చూసి మనవాళ్ళు తెగ ఎమోషనల్ అవుతున్నారు.ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా తండ్రిగా తన బాధ్యతను విస్మరించలేదు ఆ రిక్షావాలా అని కొనియాడుతున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.అతడి భార్య ఇంకొకరి మోజులో పడి వెళ్ళిపోయింది.

అయినప్పటికీ, తన కూతురు, కుమారుడికి అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు ఆ బాధ్యత గల తండ్రి.

తాజాగా, అతడికి సంబంధించిన ఓ వీడియోను ఒకరు తీయడంతో అది దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

వివరాలిలా వున్నాయి.మధ్యప్రదేశ్‌ల్‌ని జబల్‌పూర్‌లో రాజేశ్ అనే వ్యక్తి రిక్షా నడుపుతూ జీవిస్తున్నాడు.

రాజేశ్ బిహార్ నుంచి ఉపాధి కోసం చాలా ఏళ్ళ క్రితం జబల్‌పూర్‌కు వచ్చి అక్కడే ఉంటున్నాడు.

సియోనీ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నాడు.వారిద్దరి ప్రేమకు చిహ్నంగా ఓ పాప, బాబు పుట్టారు.

అయితే, కొన్ని నెలల క్రితం అతడి భార్య మరొక వ్యక్తితో కలిసి వెళ్ళిపోయింది.

"""/"/ దీంతో తన పిల్లలు అనాథలు కాకూడదని వారిని రాజేశ్ అన్నీ తానై చూసుకుంటున్నాడు.

కూతురికి దాదాపు మూడేళ్ళ వయసు ఉంటుంది.ఆమెను ఇంటి వద్ద వదిలి ఏడాది వయసున్న తన కొడుకుని రిక్షాలో తన వెంటే తీసుకెళ్తున్నాడు.

రిక్షా తొక్కగా వచ్చిన డబ్బుతో పిల్లలను పోషిస్తున్నాడు.వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.

తాజాగా, ఒక చేత్తో తన కుమారుడిని ఎత్తుకుని అతడు రిక్షా తొక్కుతుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు.

సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.తనను, పిల్లలను వదిలి మరో యువకుడితో వెళ్ళిపోయిన తన భార్య ఇక తనకు వద్దని, తన పిల్లలు చాలని, వారిని బంగారంలా చూసుకుంటానని రాజేశ్ అంటున్నాడు.

ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్11, బుధవారం 2024