నా కూతురిలో అమ్మను చూసుకున్నా.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో విలక్షణ నటుడు అయినా రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

రాజేంద్ర ప్రసాద్ ఒక్కగానొక్క కూతురు గాయత్రి ( Gayatri )గుండెపోటుతో కన్నుమూశారు.కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో నిన్న హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం ఆమె మరణించారు.కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కూతురి మరణంతో ఒక్కసారిగా రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొనడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

"""/" / ఇప్పటికే ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

మరికొందరు రాజేంద్రప్రసాద్ ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించి ఆయనకు ధరించి అవుతున్నారు.ఇకపోతే రాజేంద్రప్రసాద్ విషయానికి వస్తే.

నటుడుగా మారి ఉన్నత స్థాయికి ఎదిగిన రాజేంద్రప్రసాద్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ ( Character Artist )గా మారి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇది తాజాగా ఆయన కూతురు మరణించిన సందర్భంగా గతంలో ఆయన తన కూతురు గురించి మాట్లాడిన మాటలకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారింది.

"""/" / ఆయన తన కూతురు గురించి మాట్లాడుతూ.ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మ పై ఒక పాట రాశారు.

దాని గురించి వివరిస్తూ, అమ్మ లేని వాడు కూతురిలో అమ్మను చూసుకుంటాడు.నా పదేళ్ల వయసులో మా అమ్మ గారు చనిపోయారు.

నేను కూడా నా కూతురిలో అమ్మను చూసుకున్నాను.కానీ ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవు.

ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది.ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించాను అని అన్నారు రాజేంద్రప్రసాద్.

ఇప్పుడు ఆమె అనారోగ్యంతో కన్ను మూయడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

నాని కి శ్రీకాంత్ ఓదెల మీద అంత నమ్మకం ఎందుకు..?