నేడు హైదరాబాద్ లో టీపీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఇవాళ తెలంగాణ పీసీసీ కార్యవర్గం అత్యవసర సమావేశం కానుంది.

మధ్యాహ్నం 3 గంటలకు నేతలు ఈ భేటీని నిర్వహించనున్నారు.చేవెళ్ల సభతో పాటు గద్వాల్ లో ఏర్పాటు చేయనున్న సభకు సంబంధించిన ఏర్పాట్లపై నాయకులు చర్చించనున్నారని తెలుస్తోంది.

అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు పార్టీలో చేరికల అంశంపై నేతలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

దాంతో పాటు తిరగబడదాం - తరమికొడదాం అనే కార్యక్రమంపై నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు నియోజకవర్గ నాయకుల మధ్య ఉన్న వివాదాలపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

తండేల్ మూవీ సెన్సార్ రివ్యూ వివరాలు ఇవే.. ఆ సన్నివేశాలే మేజర్ హైలెట్!