అంతుచిక్కని మోడీ స్ట్రాటజీలు !

రాజకీయాల్లో ఏ నాయకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ? ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాడు ? అనే విషయాలపై రాజకీయ విశ్లేషకులు ముందుగానే ఊహిస్తూ ఉంటారు.

ఎందుకంటే గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాల పరంగాను, అమలు చేసిన వ్యూహాల పరంగాను.

అతని ఆలోచన భావం ఎలా ఉండబోతుంది అనేది ఉండుగానే పసిగట్టవచ్చు.అయితే ఇలా అందరి విషయంలో ఊహించడం కష్టం కొందరు నాయకులు తీసుకునే నిర్ణయాలు, అనుసరించే వ్యూహాలు ఎవరి అంతుచికని విధంగా ఉంటాయి.

ప్రస్తుతం ప్రధాని మోడీ( Narendra Modi ) ఆలోచన విధానం కూడా ఈ రెండో కేటగిరీలోకే వస్తుంది.

ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటూ ఉంటారు.

"""/" / గతంలో నోట్ల రద్దు విషయంలోనూ ఆర్టికల్ 370 రద్దు( Article 370 ) విషయంలోనూ ఎంత సీక్రెట్ గా తన వ్యూహాలను అమలు చేశారో అందరం చూశాం.

నోట్ల రద్దు అంశం సొంత పార్టీ నేతలకే తెలియకుండా మోడీ అమలు చేశారంటే అతిశయోక్తి కాదు.

పార్లమెంట్ లో కాదు.బహిరంగ సభల్లో కాదు ఎవరు ఊహించని విధంగా ప్రెస్ పెట్టి నోట్ల రద్దు ప్రకటించి దేశ ప్రజలను ఒక్కసారిగా షాక్ కు గురి చేశారు.

ఇక ఆర్టికల్ 370 విషయంలో కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మోడీ.

అసలు ఎవరి ఆలోచనల్లో లేని ఆర్టికల్ 370 ని అనూహ్యంగా బిల్లు ప్రవేశ పెట్టి ఒక్కసారిగా అందరినీ విస్మయనికి గురి చేశారు.

ఇప్పుడు కూడా మోడీ ఏదో ప్లాన్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. """/" / ఎందుకంటే అనూహ్యంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం, ఈ సమావేశాలకు సంబంధించి ఎజెండా ఏంటి అనేది ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం వంటివి చూస్తే మోడీ మరోసారి దేశ ప్రజలను షాక్ కు గురి చేయడం గ్యారెంటీ అనేది కొందరు చెబుతున్నా మాట.

అయితే జమిలి ఎలక్షన్స్( Jamili Elections ), దేశ పేరు మార్పు వంటి వాటిపై బిల్లు ప్రవేశ పెట్టేందుకే ఈ పార్లమెంట్ సమావేశాలు అని భావిస్తున్నప్పటికి.

అందుకోసమేనా ఇంకా ఏమైనా మోడీ ప్లాన్ చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే జమిలి ఎలక్షన్స్ , దేశ పేరు మార్పు వంటివి కాకుండా మహిళా బిల్లు తెరపైకి వచ్చింది.

దానికి తోడు దేశ పేరు మార్పు కు సిద్దమైతే కొత్త పార్లమెంట్ భవనానికి ఇండియా పదాన్నే వాడారు.

దీంతో అసలు ఈ పార్లమెంట్ సమావేశాలతో మోడీ స్ట్రాటజీ ఏంటో అర్థంకాక విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు.

మొత్తానికి అంతుచిక్కని వ్యూహాలకు మోడీ కేరాఫ్ అడ్రస్ గా మారారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బన్నీ పుష్ప2 మూవీ టార్గెట్ లెక్కలివే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే అంత రావాలా?