‘‘ అక్కడ ఎన్నో చేయాలనుకుంటున్నాం.. కానీ’’ : ఇండియాలోకి టెస్లా ఎంట్రీపై ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చొచ్చుకెళ్లాలని భావిస్తున్న టెస్లా అధినేత ఎలన్‌మస్క్.ఇండియాలో ప్లాంట్ ఏర్పాటుకు వడివడిగా కదులుతున్నారు.

అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై వున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతూ ఆయన కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశారు.

స్థానిక తయారీదారులను ప్రోత్సహించేందుకు గాను దిగుమతి సుంకాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

తాము భారత్‌లో ఎన్నో చేయాలనుకుంటున్నాం కానీ.ఇక్కడి దిగుమతి సుంకాలు ప్రపంచంలోనే అత్యధికమని ఎలన్ మస్క్ ఓ ట్వీట్‌కు సమాధానం చెప్పారు.

కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు కనీసం తాత్కాలిక సుంకం ఉపశమనం కలిగిస్తున్నందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.

భారతదేశంలోని ఇతర లగ్జరీ కార్ల తయారీదారులు కూడా గతంలో దిగుమతి చేసుకుంటున్న కార్లపై పన్నులు తగ్గించాలని ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేశారు.

కానీ దేశీయ ప్రత్యర్ధుల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల విజయం సాధించలేకపోయారు.ఈ ఏడాది భారత్‌లో అమ్మకాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న టెస్లా.

అన్ని మంత్రిత్వ శాఖలకు, నీతి ఆయోగ్‌కు లేఖలు రాసింది.పూర్తి అసెంబ్లీంగ్ జరిగిన కార్లపై 40 శాతం మేర పన్నులు తగ్గించాలని కోరింది.

40 శాతం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు మరింత సరసమైన ధరకు రాగలవని మస్క్ అభిప్రాయపడుతున్నారు.

కానీ ఈ లేఖలపై నీతి ఆయోగ్ కానీ, రవాణా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు స్పందించలేదు.

టెస్లా యూఎస్ వెబ్‌సైట్ ప్రకారం.మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ ధర 40,000 డాలర్ల కంటే తక్కువే వుంది.

ప్రస్తుతం భారత్‌లో ప్రీమియం ఈవీల మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే వుంది.ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు తక్కువ మంది వద్దే వుండటంతో పాటు దేశంలో కార్లను ఛార్జింగ్ చేసుకునే సదుపాయాలు చాలా పరిమితంగా వున్నాయి.

గతేడాది భారత్‌లో విక్రయించిన 2.4 మిలియన్ కార్లలో కేవలం 5000 మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు వున్నాయి.

వీటి ధర 28000 డాలర్ల కంటే తక్కువే.డైమ్లెర్ మెర్సిడెజ్ బెంజ్ గతేడాది భారత్‌లో తన ఈక్యూసీ లగ్జరీ ఈవీని 1,36,000 డాలర్లకు విక్రయించింది.

అలాగే ఆడి ఈ వారం మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను 1,33,000 డాలర్ల ధరతో విక్రయాలను ప్రారంభించింది.

"""/"/ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మార్చిలో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.

దేశంలో టెస్లా ఉత్పత్తి వ్యయం చైనాలో కంటే తక్కువగా వుండే ప్రోత్సాహకాలు ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా వుందని తెలిపింది.

రెండుసార్లు ఫెయిల్.. ఐదో ప్రయత్నంలో సివిల్స్ లో ఏడో ర్యాంక్.. వరుణ్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!