అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ గెలిస్తే .. ఎలాన్ మస్క్ ఆయనకు సలహాదారుడు కానున్నారా .?
TeluguStop.com
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .( Donald Trump ) టెస్లా అధినేత , బిలియనీర్ ఎలాన్ మస్క్( Elon Musk ) మధ్య సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది.నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ గనుక గెలిస్తే .
ఎలాన్ మస్క్‌ను తన పాలసీ అడ్వైజర్‌గా( Policy Advisor ) నియమించుకోవచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఆర్ధిక , సరిహద్దు భద్రతా విధానాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
ఇప్పటికే తన ప్రచార ప్రభావంపై డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ తెలియజేశాడు.రెండవసారి అధ్యక్ష బరిలో నిలిచిన జో బైడెన్‌కు( Joe Biden ) మద్ధతు ఇవ్వొద్దని అమెరికా వ్యాపారవేత్తలను మస్క్ ఒప్పించారు.
బిలియనీర్, ఇన్వెస్టర్ నెల్సన్ పెల్ట్జ్‌తోనూ( Nelson Peltz ) ఎలాన్ మస్క్ మాట్లాడినట్లుగా కథనంలో పేర్కొన్నారు.
దీనిపై ట్రంప్ ప్రచార ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ ( Brian Hughes ) మాట్లాడుతూ .
తన పాలనా కాలంలో ఎవరైనా వ్యక్తి ఎలాంటి పాత్ర పోషిస్తాడనేది ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారని చెప్పారు.
"""/" /
కాగా.ఈ ఏడాది మార్చిలో కీలకమైన సూపర్ ట్యూస్‌డే ముగిసిన తర్వాత ట్రంప్ , ఎలాన్ మస్క్‌లు ఫ్లోరిడాలో( Florida ) కలవడం అమెరికా రాజకీయాల్లో కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మస్క్ ఇన్వెస్టర్‌గా మారబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
దీనిలో భాగంగా ట్రంప్‌తో ఎలాన్ మస్క్ సమావేశమైనట్లుగా సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.
ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో జరిగిన ఈ సమావేశంలో అనేకమంది సంపన్న రిపబ్లికన్ దాతలు కూడా పాల్గొన్నారు.
"""/" /
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా ట్రంప్ తన ఎన్నికల ప్రచారానికి ఆర్ధిక సహాయం కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్నారు.
మార్చి 2న ట్రంప్, ఎలాన్ మస్క్‌ల యాజమాన్యంలోని ప్రైవేట్ జెట్‌లు పామ్ బీచ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఆసక్తికరమైన పరిశీలన జరిగింది.
వారి రాకపోకలు కేవలం గంటలోపే ముగిశాయి.ఎలాన్ మస్క్ ట్రంప్‌కు ఆర్ధిక సహాయాన్ని అందిస్తారా లేక 2024 అధ్యక్ష ఎన్నికల్లో మద్ధతు ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
జూన్ 2017లో ఎలాన్ మస్క్ .ట్రంప్ సలహా మండలిని విడిచిపెట్టాడు.
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎముకల బలహీనత, రక్తహీనత రెండిటికీ చెక్ పెట్టే బెస్ట్ డ్రింక్ ఇది!