భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. అందుకే ఆలస్యం, మరోసారి కేంద్రంపైకి నెట్టేసిన ఎలన్ మస్క్..!!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో గుత్తాధిపత్యాన్ని సాధించేందుకు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కన్ను భారత్‌పై పడింది.కానీ ఇక్కడి పన్నులు, పారిశ్రామిక విధానం, ఇతర కారణాలు మస్క్‌ దూకుడుకు ప్రతిబంధకాలుగా మారాయి.

టెస్లా కార్లను భారత్‌లోకి తెచ్చేందుకు 2019 నుంచి ఇప్పటి వరకు ఆయన చేయని ప్రయత్నం లేదు.

ఇందుకు మస్క్‌ చెప్పిన కండీషన్లే కారణంగా భారత ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.తొలుత విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, తర్వాతే యూనిట్‌ను నెలకొల్పుతామని మస్క్‌ షరతు పెట్టారు.

దీంతో పాటు కార్ల దిగుమతిపై ఉన్న సుంకాన్ని కూడా తగ్గించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

ఈ మేరకు కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

దీనిపై కేంద్రం, టెస్లా మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి కొలిక్కి రాలేదు.

తాజాగా భారత మార్కెట్లో టెస్లా కార్ల ఎంట్రీ ఉంటుందా.? వుండదా.

? అంటూ ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించారు.దీనికి మస్క్‌ స్పందిస్తూ.

‘‘ భారత ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పటికీ ప్రయత్నాలు సాగిస్తున్నాం’’ అని ఆయన సదరు నెటిజన్‌కు బదులిచ్చారు.

దీంతో కొద్దిసేపటికే ఈ వ్యవహారం పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది.పలువురు నెటిజన్లు భారత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

ఇది నానాటికీ వివాదంగా మారేలా వుండటంతో కేంద్రం స్పందించింది.సోషల్‌మీడియా ద్వారా మస్క్‌ భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇలాంటి ట్రిక్స్‌కు భారత్ తలొగ్గదని సదరు వర్గాలు స్పష్టం చేశాయి.భారత్‌లో టెస్లా కార్లను తయారుచేసే అంశంపై క్లారిటీ ఇవ్వకుండానే దిగుమతి సుంకాలను తగ్గించాలని ఎలన్ మస్క్ డిమాండ్‌ చేస్తున్నారని కేంద్రం పేర్కొంది.

ఆటోమొబైల్‌ రంగానికి, ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారత్‌ ప్రోత్సాహకాలను ఇస్తోందని గుర్తుచేసింది.ఒక వేళ టెస్లా భారత్‌లోనే కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పితే ఎంతో మేలు కలుగుతుందని ఆ వర్గాలు సూచించినట్లుగా జాతీయ మీడియా తెలిపింది.

"""/" / కాగా.గతేడాది భారత్‌లో అమ్మకాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న టెస్లా.

అన్ని మంత్రిత్వ శాఖలకు, నీతి ఆయోగ్‌కు లేఖలు రాసింది.పూర్తి అసెంబ్లీంగ్ జరిగిన కార్లపై 40 శాతం మేర పన్నులు తగ్గించాలని కోరింది.

40 శాతం దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు మరింత సరసమైన ధరకు రాగలవని మస్క్ అభిప్రాయపడ్డారు.

అయితే విద్యుత్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించే ఆలోచన తమకు లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

టెస్లా యూఎస్ వెబ్‌సైట్ ప్రకారం.మోడల్ 3 స్టాండర్డ్ రేంజ్ ప్లస్ ధర 40,000 డాలర్ల కంటే తక్కువే వుంది.

ప్రస్తుతం భారత్‌లో ప్రీమియం ఈవీల మార్కెట్ ఇంకా ఆరంభ దశలోనే వుంది.ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు తక్కువ మంది వద్దే వుండటంతో పాటు దేశంలో కార్లను ఛార్జింగ్ చేసుకునే సదుపాయాలు చాలా పరిమితంగా వున్నాయి.

"""/" / బెంగళూరులో తన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు టెస్లా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

అన్నీ అనుకున్నట్లే జరిగితే అమెరికా తర్వాత టెస్లా పరిశోధనా కేంద్రం ఉన్న రెండో దేశం ఇండియానే అవుతుంది.

మరోవైపు భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు పెరుగుతోంది.2025 నాటికి ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా రూ.

50 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.మొత్తం రూ.

50 వేల కోట్ల లక్ష్యంలో రూ.15 వేల కోట్లు.

వాహనాల విడి భాగాలైన బ్యాటరీ, కంట్రోలర్, మోటార్ల నుంచి రానుంది.వీటికి తోడు రాబోయే రోజుల్లో భారత్‌లో 30 లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయని మార్కెట్ వర్గాల అంచనా.

Surekha Vani : నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను.. కార్ కూడా లోన్ లో ఉంది