పరాగ్ వద్దు.. కానీ భారతీయుడే ముద్దు, ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ నిర్ణయాల వెనుక ‘‘అతడే’’..!!

ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.ఆ సంస్థలో తన మార్క్ చూపిస్తున్నారు.

ఇప్పటికే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెడ్ సెగల్, పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా కీలక స్థానాల్లో వున్న వారిపై వేటు వేసి రాబోయే రోజుల్లో తన వైఖరి ఎలా వుంటుందో ముందో హెచ్చరించారు.

కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను రద్దు చేసిన ఆయన.తానే ఏకైక డైరెక్టర్‌గా కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.మొత్తం ఉద్యోగులను 7,500 నుంచి 2,000కు తగ్గించాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు కొన్ని మినహా.ఇప్పటి వరకు ఉచితంగానే సేవలు అందించిన ట్విట్టర్‌ను ఇకపై పూర్తి కమర్షియల్‌గా మార్చేందుకు ఆయన సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు పెయిడ్ వెర్షన్ తీసుకొస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.బ్లూటిక్ సహా అదనపు ఫీచర్ల సబ్‌స్క్రిప్షన్‌ ధరను పెంచుతారని తెలుస్తోంది.

ఇదిలావుండగా.ట్విట్టర్ గురించి ఎలాంటి అవగాహన లేకుండా ఎలాన్ మస్క్ ఈస్థాయి నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతున్నారనే అంతా ముక్కుమీద వేలేసుకుంటున్నారు.

అయితే భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ శ్రీరామ్ కృష్ణన్.మస్క్‌ను వెనకుండి నడిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీంతో ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. """/"/ శ్రీరామ్‌ది తమిళనాడు రాష్ట్రం.

చెన్నైలో పుట్టిపెరిగాడు.2001 నుంచి 2005 వరకు ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు.

మైక్రోసాఫ్ట్‌లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేశాడు.దీనితో పాటు మెటా, స్నాప్‌చాట్ తదితర కంపెనీల్లోనూ పనిచేశారు.

భార్య ఆర్తి రామ్మూర్తితో కలిసి క్లబ్ హౌజ్ టాక్ షో చేశాడు.ఈ సమయంలోనే ఎలాన్ మస్క్‌తో శ్రీరామ్ కృష్ణన్‌కి పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలోనే ట్విట్టర్ కొనుగోలుతో పాటు కంపెనీలో ఎడిట్ బటన్ సహా ప్రస్తుతం వున్న పాలసీని పొడిగించడం, అకౌంట్ వెరిఫికేషన్ వంటి కీలక నిర్ణయాలపై ఎలాన్ మస్క్‌కి సలహాలు అందజేశాడు.

ఈ అనుబంధంతో శ్రీరామ్ కృష్ణన్ భవిష్యత్తులో ట్విట్టర్ సీఈవో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…