మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్ అమరిక.. ఈ చిప్ ఎలా పని చేస్తుందంటే..?

ఎలాన్ మాస్క్( Elon Musk ) నేతృత్వంలోని న్యూరా టెక్నాలజీ కంపెనీ ఈ న్యూరాలింక్ చిప్ ను( Neuralink Chip ) అభివృద్ధి చేసింది.

ఆదివారం తాజా గా ఓ మనిషి మెదుడులో ఈ చిప్ ను విజయవంతంగా అమర్చడం, ఆ చిప్ బాగా పనిచేయడం, రోగి వేగంగా కోరుకుంటున్నాడని ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

న్యూరాలింక్ చిప్ అంటే ఏమిటో.ఆ న్యూరాలింక్ చిప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

న్యూరా టెక్నాలజీ రూపొందించిన మొదటి న్యూరాలింక్ ఉత్పత్తిని టెలిపతి( Telepathy ) అని పిలుస్తారు.

ఈ న్యూరాలింక్ చిప్ ను మెదడులో( Brain ) అమర్చడం ద్వారా ఆలోచనలకు నియంత్రణ అందిస్తుంది.

అంటే మీరు ఏదైనా చేయాలని ఆలోచిస్తే, మీ ఆలోచనల నుండి మీ కంప్యూటర్ కు లేదా స్మార్ట్ ఫోన్ కు ఒక కమాండ్ వెళ్తుంది.

"""/" / ఆ విధంగా అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ ఈ న్యూరాలింక్ చిప్ ద్వారా సాధ్యపడుతుంది.

ఈ న్యూరాలింక్ చిప్ ఎవరికోసం తయారు చేశారంటే.పక్షవాతం, మూర్ఛ, పార్కిన్సన్స్ వ్యాధి లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు తమ పనులు తాము చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న సంగతి మనకి తెలిసిందే.

అలా బాధపడే వ్యక్తులు కేవలం తమ ఆలోచనలను ఉపయోగించి మాత్రమే తమ ఫోన్లు, Pc లను ఆపరేట్ చేయడంలో ఈ చిప్ సహాయపడుతుంది.

"""/" / న్యూరాలింక్ అనేది ఎలాన్ మాస్క్ 2017 లో స్థాపించిన స్టార్టప్.

గతేడాది ఈ స్టార్టప్ US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుండి మొదటి మానవ ట్రయల్ నిర్వహించడానికి అనుమతి పొందింది.

ఆ తర్వాత ఈ చిప్ లను ఆ మార్చడానికి వాలంటీర్లను( Volunteers ) కోరుతున్నట్లు ప్రకటించింది.

అయితే ముందుగా ఈ చిప్ లను జంతువులకు అమర్చి ప్రయోగాలు చేశారు.విజయవంతం అయిన తర్వాత మనిషి మెదడులో అమర్చడం మొదలుపెట్టారు.

పవన్ కళ్యాణ్ మూవీ మళ్లీ వాయిదా పడిందా.. రాబిన్ హుడ్ డేట్ వెనుక రీజన్ ఇదేనా?