ఈ ఫోన్‌తో మార్స్ నుంచి కూడా మాట్లాడొచ్చు… మస్క్ సంచలన ప్రకటన!
TeluguStop.com
అపర కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్( Elon Musk ) తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో టెస్లా ఫోన్‌కు( Tesla Phone ) సంబంధించి ఒక ఫొటోను షేర్ చేశారు.
ఫోన్‌ను చూపించిన తర్వాత నెటిజన్లు ఫిదా అయిపోయారు.దాని లుక్కు కూడా చాలా మందికి నచ్చేసింది.
ఐఫోన్ కంటే ఈ ఫోన్ మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా ఉంటుందా అనే కోణంలో నెటిజన్లు చర్చలు కూడా మొదలు పెట్టారు.
ఈ ఫోన్ ఎలా పనిచేస్తుందో చెప్పాలని మస్క్‌ని కోరారు.ఒకరు టెస్లా మొబైల్ సైజు గురించి అడిగితే మరొకరు ఇతర గ్రహాల నుంచి ఈ ఫోన్ తో కాల్స్ చేసుకోవచ్చా అని అడిగారు.
వీటన్నిటికీ మస్క్ అదిరిపోయే సమాధానాలు చెప్పి ప్రజల్లో ఆసక్తిని పెంచేశారు.ఇందులో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఫోన్‌ను మార్స్( Mars ) అంటే అంగారక గ్రహం నుంచి కూడా ఉపయోగించవచ్చని మస్క్ సంచలన ప్రకటన చేశారు.
ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.దానిని 5 మిలియన్ల మందికి పైగా వ్యూస్, 85.
7k లైక్‌లు, 6,395 రీట్వీట్‌లు ఉన్నాయి. """/" /
టెస్లా ఫోన్ ఫీచర్‌లు గురించి ఎలాన్ మస్క్ ఏమీ చెప్పలేదు, కానీ అది స్టార్లింక్( Starlink ) కనెక్టివిటీని కలిగి ఉంటుందని అతను చెప్పాడు.
స్టార్లింక్ అనేది టెస్లా అభివృద్ధి చేస్తున్న ఒక శాటిలైట్ ఇంటర్నెట్ సేవ.ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అధిక-వేగమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి రూపొందించబడింది.
ఎక్స్ యాప్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా ఈ ఫోన్ ఉందని కూడా మస్క్ వెల్లడించారు. """/" /
టెస్లా ఫోన్‌ను త్వరలో విడుదల చేయబడుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియదు.
కానీ ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత, ఫోన్ గురించి ప్రజల ఆసక్తి పెరిగింది.
టెస్లా ఫోన్ విడుదలైతే, ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్‌లలో ఒకటి అవుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
మస్క్ ఈ ఫోన్ కచ్చితంగా తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అదే జరిగితే ప్రజలు అరచేతిలో ప్రపంచాన్ని యాక్సెస్ చేయడం కుదురుతుంది.
హెచ్ 1 బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు