పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను వెతికి అప్పగించిన ఎల్లారెడ్డిపేట పోలీస్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: సెంట్రల్ ఏక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ ద్వారా పదిహేను రోజుల క్రితం మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ గుర్తింపు.
గుండారం గ్రామానికి చెందిన గూడెం రాములు అనునతడు తేదీ 04.01.
2024 రోజున పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ గొల్లపల్లి గ్రామంలో పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా ,
అట్టి సెల్ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి, సెల్ ఫోను స్వాధీనం చేసుకొని, తిరిగి ఫిర్యాదుకి ఈరోజు ఎల్లారెడ్డిపేట యస్.
ఐ.రమాకాంత్ అందించడం జరిగింది.
ఇకనుండి ఎవరు సెల్ఫోన్ అయినా మిస్సయినచో వారు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన, లేదా వారు ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకున్న వారి సెల్ ఫోన్ త్వరగా గుర్తించడానికి అవకాశం ఉందని ఎల్లారెడ్డిపేట యస్.
ఐ తెలపడం జరిగింది.ఈ యాప్ ను అందరూ వారి వారి సెల్ ఫోన్ లో కూడా వినియోగించుకోవడానికి అవకాశం కలదు.
చిన్నోడితో సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్న పెద్దోడు… సంక్రాంతికి వస్తున్నాం టీమ్ తో మహేష్!