సింగసముద్రాన్ని సందర్శించిన ఎల్లారెడ్డీపేట సి ఐ శశిధర్ రెడ్డి
TeluguStop.com
మత్తడి దూకుతున్న సింగ సముద్రంహర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు, ప్రజలు సింగసముద్రాన్ని సందర్శించిన ఎల్లారెడ్డీపేట ( Ellareddypet )సి ఐ శశిధర్ రెడ్డి సందర్శకులకు పలు సూచనలు చేసిన సి ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ లోని సింగ సముద్రం గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం( Reservoir ) పూర్తి స్థాయిలో నిండి మత్తడి దూకడం జరుగుతుంది.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 23 అడుగులు కాగా పూర్తిస్థాయిలో నిండి సింగ సముద్రం పరవళ్ళు తొక్కుతుంది.
దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎగువ నుండి అటు కామారెడ్డి జిల్లా ఎల్లంపేట్, అన్నారం, రెడ్డిపేట్ వాగులు , సిరిసిల్ల జిల్లా ఏగువ మానేరు వాగు ద్వారా వరద నీరు ఉధృతంగా వచ్చి సింగ సముద్రంలో చేరుతున్నాయి.
కావున సముద్రలింగాపూర్ పరిసరాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా సందర్శనకు వెళ్లకూడదని, చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు, పోలీసులు సూచించారు.
మధుమేహులు ఈ ఆకుల కషాయం తాగితే షుగర్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది!