యువతి వివాహానికి చేయూతనందించిన ఉపసర్పంచ్ దంపతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి బాబాయ్ ఇంటి వద్ద పెరిగిన యువతికి ఎల్లారెడ్డి పేట ఉపసర్పంచ్ ఒగ్గు రజిత - బాలరాజు యాదవ్ దంపతులు ఆమె వివాహానికి అండగా నిలిచారు.

ఆమె పరిస్థితిని నేరుగా పలువురి దృష్టికి తీసుకెళ్లగా యువతి వివాహానికి సహాయం చేశారు.

ఎల్లారెడ్డి పేట మండలంలోని రాచర్ల బోప్పపూర్ గ్రామానికి చెందిన నవ్య శ్రీ వివాహం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన సందీప్ తో ఈ నెల 24 న జరిగింది.

కాగా శనివారం తల్లిగారింటికి వచ్చిన నవ్య శ్రీ సందీప్ దంపతులను ఎల్లారెడ్డి పేట ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ దంపతులు వారిని వారితో పాటు నవ్య శ్రీ బాబాయ్ శేఖర్ దంపతులను ఇంటికి ఆహ్వానించి ఉపసర్పంచ్ దంపతులు వారికి బోజనాలు వడ్డించి వారితో సహపంక్తి భోజనాలు చేశారు.

అనంతరం నూతన జంటకు నూతన వస్త్రాలు అందించి ఆశీర్వదించారు.నవ్య శ్రీ కి ఇద్దరు కవలలైన తోబుట్టువులు ఉండగా ప్రస్తుతం వారు ఆరవ తరగతి పూర్తి చేసుకొని ఏడవ తరగతి చదువుకుంటున్నారు.

వీరిని ఏదేని ప్రభుత్వ హాస్టల్ లో చేర్పించి చదివిస్తామని ఉపసర్పంచ్ దంపతులు నవ్య శ్రీ కి హామీ ఇచ్చారు.

తాము నవ్య శ్రీ వివాహానికి చేయూత అందించాలని కోరగా ఆమె వివాహానికి చేయూత అందించిన ప్రతి ఒక్కరికీ ఎల్లారెడ్డి పేట ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ తో పాటు నవ్య శ్రీ బాబాయ్ శేఖర్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు పంజా సంపత్ కుమార్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు బుచ్చిలింగు సంతోష్ గౌడ్ పాల్గొన్నారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?