నా వివాహానికి సహాయం చేయండని వేడుకుంటున్న కాబోయే పెండ్లి కూతురు

నా వివాహానికి సహాయం చేయండి.అన్ని తానై బాబాయ్ పోషించాడు.

మనసున్న పెద్దలు కనికరించండి.నా తల్లి చనిపోయింది.

నా తండ్రికి మతిస్థిమితం లేదు.చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన మమ్మల్ని ముగ్గురిని పోషించాడు.

నాకు ఇప్పుడు పెండ్లి నిశ్చయమైంది.చేతిలో పెండ్లికి చిల్లి గవ్వ లేదు.

దయచేసి మానవతా హృదయం కొద్ది సహాయం చేయండి అని వేడుకుంటుంది కాబోయే పెండ్లి కూతురు నవ్య.

వివరాలు ఇలా ఉన్నాయి.ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల బొప్పపుర్ గ్రామానికి చెందిన మిట్టపెల్లి నవ్యశ్రీ కి సిరిసిల్ల పట్టణానికి చెందిన అగుళ్ళ స్వామి లలిత ల కుమారుడు సందీప్ తో ఈ నెల వివాహం కానుంది.

నవ్య శ్రీ తల్లి మైసమ్మ చిన్నప్పుడే చనిపోగా తండ్రి కిరణ్ కు సరిగా మతిస్థిమితం లేదు.

నవ్య శ్రీ యే కాకుండా కవల పిల్లలు చింటు(10)చిన్నారి(10) ఉన్నారు.తల్లిని చిన్నప్పుడే కోల్పోయి తండ్రి మతిస్థిమితం లేకపోవడంతో మా బాబాయ్ శేఖర్ అన్ని తానై పెండ్లికి ముందుండి నడిపిస్తున్న శేఖర్ దినసరి కూలీ గా పని చేస్తున్నాడు.

మానవతావాదు లు తన పెండ్లికి దన రూపేణ, వస్తు రూపేణ సహాయం చేయాలని నవ్యశ్రీ వేడుకుంది.

ఆర్థిక సహాయం చేయదలచిన వారు 9000996122 (మిట్టపెళ్ళి శేఖర్) ఫోన్ నంబర్ కు ఫోన్ పే చేసి ఆదుకోవాలని కొరుచున్నారు.

మొటిమల నుంచి పొడి చర్మం వరకు కలబందతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?