సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌కు భారత్‌తో బంధుత్వం: ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు..?

సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌కు భారత్‌తో బంధుత్వం: ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మసాచుసెట్స్, లాస్‌ఏంజిల్స్ సెనేటర్, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్ధి ఎలిజబెత్ వారెన్‌‌కు భారతదేశంతో బంధుత్వం ఉన్నట్లుగా తేలింది.

సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌కు భారత్‌తో బంధుత్వం: ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?

చాలా మందికి అంతగా తెలియని ఈ విషయం ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతోంది.

సెనేటర్ ఎలిజబెత్ వారెన్‌కు భారత్‌తో బంధుత్వం: ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు?

వారెన్ కుమార్తె అమేలియా త్యాగి భారత జాతీయుడు, మెరైన్ రోబోటిక్స్ నిపుణుడైన సుశీల్ త్యాగిని వివాహం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో సుశీల్.తన అత్తగారి కుటుంబంతో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఎల్ఏ టౌన్ హాల్‌లో తన పిల్లలు అమ్మమ్మ ఎలిజబెత్ వారెన్‌తో ఉన్నారని ఆయన పోస్ట్ చేశారు.

ఇందులో ఎలిజబెత్ వారెన్, అట్టికస్, లావినియా, ఆక్టేవియా, అమేలియా వారెన్ త్యాగి, సుశీల్ త్యాగి ఉన్నారు.

ముగ్గురు భారతీయ- అమెరికన్ మనవరాళ్లకు అమ్మమ్మ అయిన వారెన్ కుటుంబానికి చెందిన అనేక సందర్భాలలో భారత్‌లోని త్యాగి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ వచ్చారు.

"""/"/ సుశీల్ త్యాగి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ, నుంచి గ్రాడ్యుయేషన్.

వార్టన్ నుంచి ఎంబీఏ, యూసీ బర్కిలి నుంచి ఓషన్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టా పొందారు.

త్యాగి తల్లి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నివసిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లోనే పెరిగిన త్యాగి.

తనకున్న చిన్న పొలంలో వ్యవసాయ పనులు చేసేవాడు.చిన్నతనంలో తమ పశువులను చెరువు దగ్గరకు తీసుకెళ్లడం, చెరకు బండ్లను క్రషర్ వద్దకు తీసుకెళుతూ తన తండ్రికి సహకరించేవాడు.

"""/"/ త్యాగి కుటుంబంలో ఎవ్వరూ కళాశాలలో అడుగుపెట్టకపోవడం, హిందీ మాధ్యమంలోనే చదవడంతో ఐఐటీ పరీక్షలకు ప్రయత్నించే సమయంలో త్యాగి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే పోలీస్ స్కాలర్‌షిప్ కోసం ప్రయత్నించి విజయం సాధించారు.

తద్వారా ఐఐటీకి ఎంపికై తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించాడు.ప్రస్తుతం సుశీల్ త్యాగి కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్‌లోని బర్కిలీ మెరైన్ రోబోటిక్స్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

సముద్ర అన్వేషణ, పరిరక్షణలో రోబోటిక్ వ్యవస్థలను భాగస్వామ్యం చేయడం త్యాగి కల.

కెనడా ప్రావిన్స్ ఎన్నికలు .. బరిలో 37 మంది భారత సంతతి అభ్యర్ధులు!