చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. యువకుడిపై దాడి
TeluguStop.com
ఉమ్మడి చిత్తూరు జిల్లా( Chittoor District )లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.గుడిపల్లి మండలం అత్తినత్తంలో గజరాజులు( Elephant Attack ) సంచరించాయి.
ఈ క్రమంలోనే వ్యవసాయ క్షేత్రంలో బోరు వద్దకు వెళ్లిన యువకుడిపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.
అటు శాంతిపురం మండలంలో మరో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది.ఎస్ గొల్లపల్లి, కోనేరు -కుప్పం మార్గంలో ఓ కారుపై ఏనుగు దాడి చేసిందని తెలుస్తోంది.
దీంతో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.గజరాజుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అలాగే ఇప్పటివరకు పలు పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి.ఈ క్రమంలో ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు( Forest Officials ) స్పందించి ఏనుగుల బారి నుంచి తమను, తమ పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు.
రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌కు చేరుకున్న ట్రంప్