పనసపండు కోసం గజరాజు పడరాని పాట్లు.. నవ్వులు పూయిస్తున్న వీడియో

మొత్తం జంతువులు అన్నింటిలో ఏనుగులు బలమైన, అత్యంత ప్రేమగల జాతిగా పరిగణించబడతాయి.అంతేకాకుండా తెలివిగా ప్రవర్తించడంలో వాటికవే సాటి.

సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆసక్తికర వీడియోలు మనకు లభ్యమవుతున్నాయి.

తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఆకలేసి ఓ పనస పండును కోసుకునేందుకు ఓ ఏనుగు పడుతున్న పాట్లు నెటిజన్లు ఆకర్షిస్తున్నాయి.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఏనుగులకు చెరకు గడలన్నా, తీపిగా ఉండే అరటి పండ్లు, పనస పండ్లు అన్నా చాలా ఇష్టం.

కొన్ని సందర్భాల్లో తమకు జూలోనూ, దేవాలయాలలోనూ కనిపించిన ఏనుగులకు చాలా మంది అరటి పళ్లు అందించి, అవి తినగానే చాలా సంతోష పడతారు.

అయితే అడవిలో ఉండే జంతువులకు అటువంటి సందర్భం ఎదురు కావు.తమకు కనిపించినవి స్వేచ్ఛగా తినేస్తాయి.

ఎవరైనా అడ్డం వస్తే తొక్కి పారేస్తాయి.అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆకలితో అలమటించిన ఆ గజరాజు తనకు పనస పండు కనిపించగానే చాలా సంతోష పడింది.

వెంటనే ఆ చెట్టు వద్దకు వెళ్లి పనస పండును కోసుకునేందుకు ప్రయత్నించింది.తన శరీరాన్ని చెట్టు కాండంపై పూర్తిగా రెండు కాళ్లతో చాచి, కొన్ని పనసపండ్లను తీయడానికి తీవ్రంగా ప్రయత్నించింది.

ఆహారం కోసం ఏనుగు చేసిన ప్రయత్నాలను గ్రామస్థులు హర్షిస్తూ, చప్పట్లు కొట్టడం వినబడింది.

అయితే, ఇది కేవలం పనస పండును పండించడమే కాకుండా నెటిజన్ల హృదయాలను కూడా గెలుచుకుంది.

ట్విటర్‌లో తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్, అటవీ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు ఈ వీడియోను పోస్ట్ చేశారు.

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి నామినేషన్