ఏడు సార్లు విద్యుత్ ధరలు పెంచారు... బండారు సత్యనారాయణమూర్తి
TeluguStop.com
జగన్ పై మండిపడ్డ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.సినిమా డైలాగ్ లతో రాష్ట్ర ప్రభుత్వం పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు.
5 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.ఐఏఎస్ అధికారుల ను జైలు పంపడం తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అబద్దాలు చెప్పడంలో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముందుంటాడు.నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బండారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడు సార్లు విద్యుత్ ధరలు పెంచారు.జగన్ పాలన అంతా బాదుడే బాదుడు 93 వార్డులో ప్రహలాదపురం లో ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టారు.
ఛీ ఛీ.. సిగ్గులేదు, బెంగళూరు మెట్రోలో అందరూ చూస్తుండగానే జంట రొమాన్స్.. (వీడియో)