విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలిః సీఎం కేసీఆర్

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని అసెంబ్లీ వేదిక‌గా సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

విద్యుత్ ఉత్ప‌త్తిలో కేంద్రం చెప్పేవ‌న్నీ గోల్ మాల్ గోవిందం మాట‌లేన‌న్నారు.సౌర‌శ‌క్తి పేరుతో విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను బ‌డాబాబుల‌కు అప్ప‌గించాల‌ని చూస్తోంద‌ని విమ‌ర్శించారు.

చెత్త‌ను వాడుకుని కూడా అద్భుతంగా క‌రెంట్ త‌యారు చేయ‌వ‌చ్చన్నారు.విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు రైతుల‌కు, పేద‌ల‌కు వ్య‌తిరేకమ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సంస్క‌ర‌ణ‌ల‌పై తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.దీని వ‌ల్ల విద్యుత్ శాఖ‌లో ఉద్యోగాలు పోతాయ‌ని తెలిపారు.

ఇత‌ర ఖర్చులు త‌గ్గించుకుని రాష్ట్రంలో రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఇస్తున్నామ‌న్నారు.కానీ కేంద్రం ఇదంతా ఓర్వ‌లేక తెలంగాణ‌లో ఎలాగైనా క‌రెంట్ బంద్ పెట్టాల‌ని చూస్తోంద‌ని ఆరోపించారు.

జగన్ కు ఇదే అతిపెద్ద సవాల్ ! మారుతారో మార్చుతారో ?