విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుః తెలంగాణ‌లో నిర‌స‌న సెగ‌

పార్ల‌మెంట్ లో కేంద్రం ప్ర‌వేశ‌పెడుతున్న విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఉద్యోగులు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.

నేష‌న‌ల్ కో -ఆర్డినేష‌న్ క‌మిటీ ఆఫ్ ఎల‌క్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజ‌నీరింగ్ జేఏసీ దేశ వ్యాప్తంగా విధులు బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు విధులు బ‌హిష్క‌రించి మ‌హా ధ‌ర్నాకు దిగారు.

నూత‌న విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్ శాఖ కార్పొరేట్ శ‌క్తుల‌కు అనుకూలంగా మారుతుంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

గ‌తంలో తీసుకువ‌చ్చిన చ‌ట్టాన్నే మార్చి కేంద్రం త‌ప్పుదోవ ప‌ట్టిస్తుంద‌ని మండిప‌డ్డారు.ఈ బిల్లు ద్వారా వినియోగ‌దారుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని వాపోయారు.

ఇప్ప‌టికైనా కేంద్రం స్పందించి విద్యుత్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ చార్జ్ షీట్..!!