సరికొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ సూపర్‌కార్… రన్నింగ్‌లో టైర్ పేలినా నో టెన్షన్ ఇక!

చైనా టెక్నాలజీ( China Technology ) గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పేదేముంది? తాజాగా చైనాకు చెందిన వాహన తయారీ సంస్థ అయినటువంటి బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) షాంఘై ఆటో షోలో తన కొత్త ఆల్-ఎలక్ట్రిక్ సూపర్‌కార్ యాంగ్‌వాంగ్ U9( The All-electric Supercar Is The Yangwang U9 )ని పరిచయం చేసి, అందరికీ షాక్ ఇచ్చింది.

విషయం ఏమంటే ఈ కారు పరిచయంతో కంపెనీ ఒక సంచలనాత్మక సాంకేతికతను ప్రదర్శించి, అందరినీ అవాక్కయేలా చేసింది.

కాగా దీనిని Disus-X అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. """/" / ఇక ఈ కారు ప్రత్యేకత ఏమంటే, ఇది రోడ్డుపై 3 చక్రాలపై కూడా పరుగెత్తగలదు.

BYD వేదికపై YangWang U9 ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టగానే, అది మీడియా ముందు బౌన్స్ అవుతూ కనిపించడం విశేషం.

BYD సూపర్‌కార్‌లో ఉపయోగించినది మరింత అధునాతనమైన ఫీచర్ అని ఈ సందర్భంగా చెబుతున్నారు నిపుణులు.

ఇది మాత్రమే కాదు, కారు కేవలం మూడు చక్రాల మీద డ్రైవింగ్ చేయడం, కారు ఫ్రంట్ రైడ్ వైపు చక్రం లేకపోయినా, కారు చాలా సాఫీగా నడుస్తున్నట్లు కూడా చూపించడం విశేషం.

"""/" / Disus-X సస్పెన్షన్ సిస్టమ్‌లో ఇంటెలిజెంట్ డంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఇవన్నీ సూపర్‌కార్‌కి ఆల్ రౌండ్ కంట్రోల్‌ని అందిస్తాయి.కారు ముందు చక్రం పాడైపోయినా లేదా టైర్ కూడా పగిలినా, ఈ సస్పెన్షన్ సిస్టమ్ కారును కొద్దిగా ముందువైపుకు వంచుతుంది.

దీని కారణంగా బ్రేక్ రోటర్లు రోడ్డును తాకవు.కారు ఎటువంటి సమస్య లేకుండా సాధారణంగా కదులుతుంది.

ఈ సిస్టమ్ బాడీ రోల్‌ను తగ్గించగలదని, రోల్‌ఓవర్ ప్రమాదాన్ని తగ్గించగలదని, అత్యవసర బ్రేకింగ్‌లో సహాయపడుతుందని కార్‌మేకర్స్ ప్రకటించారు.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?