ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారని ఎంతపని చేశాడు.. !

తప్పు చేసిన వారిపట్ల చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్లుతుంది.ఎటుతిరిగి తప్పుచేసిన వారు తాము పొరబాటు చేశామని ఒప్పుకోవడమే తరువాయి.

కానీ సమాజంలో నూటికి 99% జనం ఆ తప్పును ఒప్పుకోరు.పైగా చేసిన పొరబాటును కప్పిపుచ్చడానికి ఎన్నో పనికిమాలిన పనులు చేస్తారు.

ప్రస్తుతం మనం చదవబోయే మ్యాటర్ ఇలాంటిదే.జీడిమెట్లలో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండిని నడిపిన ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు.

కాగా అతను మైనర్ అని గుర్తించిన పోలీసులు ఆ వాహనం స్వాధీనం చేసుకుని చలాన్ కూడా రాశారట.

వెంటనే ఆ బాలుడు తన తండ్రికి ఫోన్ చేయగా అతను జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ తో ఫోన్లో మాట్లాడి ఆ బండిని, తన కొడుకుని విడిపించే ప్రయత్నం చేశాడట.

"""/"/ అయితే ఆ ఎస్ఐ ఈ విషయంలో తాను చేసేదేం లేదని, చలానా కూడా రాశానని చెప్పాడట.

దీంతో జీడిమెట్ల విద్యుత్ శాఖలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న ఇతను సాయంత్రం ఆరు దాటిన తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తోపాటు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశాడట.

ఇక సుమారుగా పోలీస్ స్టేషన్లు 2 గంటలపాటు చీకట్లోనే ఉన్నాయట.ఈ విషయం జీడిమెట్ల సీఐ నాగరాజు దృష్టికి వెళ్లగా ఇతను విద్యుత్ శాఖ డీఈతో మాట్లాడి కరెంట్ వచ్చేలా చేశారట.

కాగా ఎలాంటి సమాచారం లేకుండా కరెంట్ కట్ చేసిన వ్యవహారంలో ఆర్టిజన్ రమేష్ పై చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారట.

సజ్జల ప్రశ్నలకు జవాబులున్నాయా… ఈసీ ఆధీనంలో ఉండాల్సిన వీడియోలు ఎలా వచ్చాయంటూ?