4-గేర్స్‌, లిక్విడ్ కూలింగ్‌తో ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!

అహ్మదాబాద్‌ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మేటర్ ఇండియాలో తొలి లిక్విడ్-కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2023లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

లాంచ్‌కి ముందు దీనిని తాజాగా ఆవిష్కరించింది.ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో మ్యాటర్ డ్రైవ్ 1.

0, మిడ్-మౌంటెడ్ లిక్విడ్-కూల్డ్ 10.5kW మోటార్ ఆఫర్ చేశారు.

ఇది 520Nm వేరియబుల్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.థొరెటల్ రెస్పాన్స్‌తో ఈ బైక్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

ఈ బైక్‌లో ఆఫర్ చేసిన మోటారు 5kWh లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది.

కంపెనీ ప్రకారం, బైక్ సింగిల్ ఛార్జ్ పై 125 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.

వందకు పైగా కిలోమీటర్ల రేంజ్ అందించే ఈ బైక్ పై సిటీ అంతా చక్కర్లు కొట్టొచ్చు.

  కీలెస్ ఇగ్నిషన్, ఆటో- క్యాన్సిలేషన్ ఇండికేటర్స్, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌తో 7-అంగుళాల ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ కన్సోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో అందించారు.

డెడికేటెడ్ మొబైల్ యాప్‌ను బైక్కు కనెక్ట్ చేసుకుని దాని ఛార్జ్ స్టేటస్, లోకేషన్ వంటి వివరాలను తనిఖీ చేయవచ్చు.

రైడ్ స్టాట్స్, అనాలసిస్ కూడా చూడవచ్చు. """/"/ మేటర్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో వస్తుంది.

ఇందులో ఎల్ఈడీ DRLతో డ్యూయల్-ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌, సీక్వెన్షియల్ LED ఇండికేటర్స్‌తో టెయిల్ లైట్స్‌ అందించారు.

మేటర్ ఎలక్ట్రిక్ బైక్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్‌ సస్పెన్షన్స్‌, డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ 2023 నుంచి షోరూమ్‌లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే కంపెనీ 50 మంది డీలర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.దీని ధర సుమారు రూ.

1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని సమాచారం.

ఈ ప్రైస్‌ కాస్త ఎక్కువే అయినా పెట్రోల్ ధరలు మండుతున్న వేళ దీనిని జనాలు అధికంగా కొనేందుకు ఆసక్తి చూపవచ్చు.

ఇన్నాళ్లు మోక్షజ్ఞ సినీ ఎంట్రీనీ అడ్డుకుంది ఆయనేనా.. వెలుగులోకి వచ్చిన నిజం!