సౌదీలో సక్సెస్‌ఫుల్ అయిన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ టెస్ట్
TeluguStop.com
ఎయిర్ టాక్సీ టెస్ట్ ఫ్లైట్( Air Taxi Test Flight ) సౌదీ అరేబియాలో సక్సెస్ అయింది.
ఇది గాల్లో ప్రయాణించింది.ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భవిష్యత్తులో ఈ ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఎయిర్ టాక్సీ ఫ్లైట్ల ద్వారా ట్రాఫిక్ సమస్య లేకుండా గాల్లో ఏ ప్రాంతానికి అయినా వెంటనే వెళ్లిపోవచ్చు.
సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు.ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
సౌదీ అరేబియాలోని( Saudi Arabia ) తబుక్ ప్రావిన్స్ లో ప్యూచరస్టిక్ ఎయిర్ టాక్సీని తయారుచేశారు.
"""/" /
మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను సౌదీ అరేబియా సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసింది.
ఎన్‌ఈఓఎమ్, జనరల్ అధారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్( General Authority Of Civil Aviation ), వోలోకాప్టర్ భాగస్వామ్యంతో వారం రోజులు టెస్ట్ చేశారు.
ఇది కమర్షియల్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఆపరేషన్స్‌ను అనుసరించే దిశగా ఒక ప్రధాన దశను చూస్తున్నట్లు గుర్తించారు.
ఇవి చాలా నిశ్శబ్ధంగా ప్రయాణించడంతో పాటు అపర్డబుల్, అడాప్టబుల్ గా ఉంటాయని చెబతున్నారు.
అలాగే ఇవి సోలార్, విండ్ పవర్ వంటి 100 శాతం రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ను వినియోగించుకుంటాయి.
వీటిని స్మార్ట్, సప్లైనబుల్ ట్రాన్స్‌పోర్టేషన్స్ ఆప్షన్స్ గా మారుస్తాయి. """/" /
మొదటి ప్రయత్నంలో భాగంగా దీని కోసం రూ.
1465 కోట్ల ఖర్చు పెట్టారు.తొలిసారి ఈ ప్రయోగం సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉందని, రవాణా వ్యవస్థలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తయారీ కంపెనీ చెబుతోంది .
2024 నాటికి ఎయిర్ టాక్సీకి సర్టిఫికేషన్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
రవాణా వ్యవస్థలో ఇది ఒక అద్బుతంగా చెబుతున్నారు.రానున్న కాలంలో ఇవి రవాణా వ్యవస్థలో కీలకంగా మారతాయని అంటున్నారు.
సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణలు చెప్పిన బాలయ్య హీరోయిన్.. సిగ్గుగా ఉందంటూ?