ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించాలి – ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి. సుదర్శన్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎలాంటి తప్పులు లేని ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి.

సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంక్షేత్ర పరిశీలనలో భాగంగా ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి.

సుదర్శన్ రెడ్డి , అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తో కలిసి జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి, వట్టెంల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని చిన్న బోనాల, శాంతి నగర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

బూత్ లెవెల్ అధికారుల తో స్పెషల్ సమ్మరీ రివిజన్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించారు.ఫారం -6,7,8 దరఖాస్తులోనీ వివరాలను క్షేత్ర స్థాయిలో విచారించారు.

ఈ సందర్బంగా ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి.సుదర్శన్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

పారదర్శకమైన ఎన్నికల జాబితాను సిద్ధం చేసేందుకు ఎలక్టోరల్‌ అధికారులు, రాజకీయపార్టీల ప్రతినిధులు కృషి చేయాలన్నారు.

భారత ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వందశాతం తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలన్నారు.

18 ఏళ్లు నిండిన యువతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.అర్హులైన వారినినందరిని ఓటర్లుగా నమోదు చేయాలన్నారు.

ఈ సమావేశంలో ఈఆర్ఓ లు ఆనంద్ కుమార్, మధు సూధన్ , సంబంధిత మండలాల తహశీల్దార్ లు తదితరులు పాల్గోన్నారు.

ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి.సుదర్శన్ రెడ్డి కి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్.

స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023 క్షేత్ర పరిశీలనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి.

సుదర్శన్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.

అనంతరం ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు సి.సుదర్శన్ రెడ్డి కలెక్టర్ ఛాంబర్ లో స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,అదనపు కలెక్టర్ తో కొద్దిసేపు సమీక్షించారు.

లోకో-పైలట్‌ ప్రేమలో యూకే మహిళ.. దీని వెనుక హార్ట్‌టచింగ్ స్టోరీ..?