మార్చి, ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు..: సీఎం జగన్
TeluguStop.com
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయని సీఎం జగన్ అన్నారు.
విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో చెప్పాలన్నారు.రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కార్యక్రమాలు చేపడుతున్నామన్న సీఎం జగన్ ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 15 వేల ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ క్రమంలోనే కోటీ 60 లక్షల ఇళ్లకు వెళ్లి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అదేవిధంగా జనవరి నెల నుంచి పింఛన్ రూ.3 వేలు అందిస్తామని వెల్లడించారు.
ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
దివ్యాంగుల కొరకు క మూవీ స్పెషల్ షో.. కిరణ్ మనస్సుకు వావ్ అనాల్సిందే!