ట్రంప్ కి 'మధ్యంతర'...అగ్నిపరీక్ష

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతోంది.రాజకీయంగా ట్రంప్ కి ఇది తొలి అగ్ని పరీక్షఅనే చెప్పాలి.

రేపు అనగా మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికలు.భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నరకు పోలింగ్‌ ప్రారంభం కానున్నాయి.

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు; సెనేట్‌లోని 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతేకాదు వీటితో పాటుగా దాదాపు 36 రాష్ట్రాలకు గవర్నర్లను కూడా ఎన్నుకోనున్నారు.

రెండేళ్ల ట్రంప్‌ పాలనకు ఈ ఎన్నికలను కొలమానంగా భావిస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ వైపు విజయం వస్తుందా లేదా అనేది సందేహమే ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న విధానాలని ఎంతోమంది అమెరికన్లు తప్పు బట్టారు.

సొంత పార్టీ నేతలే ట్రంప్ పై వ్యతిరేకత వెళ్లగక్కారు.అలాంటిది ఇప్పుడు మధ్యంతర ఎన్నికల్లో వచ్చే తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిని రేపుతోంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇదిలాఉంటే అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మధ్యంతర ఎన్నికలుగా ఈ ఎన్నికలని గుర్తిస్తున్నారు.

ఎందుకంటే గెలుపు ధ్యేయంగా ఇరు పార్టీలూ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నాయి.గతంలో అత్యధికంగా 4.

2 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తే.ఈ ఎన్నికల్లో 5.

2 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.38 వేల కోట్లు ఖర్చు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

సిల్క్‌స్మిత దెబ్బకి ఆ పాట విషయంలో చిరంజీవి, రాఘవేంద్రరావు ఎన్నో అగచాట్లు పడ్డారట పాపం?