ఎన్నికలంటే అలా ఖర్చు పెట్టాల్సిందే !
TeluguStop.com
రాజకీయ నాయకులకు రోజువారి మెయింటెనెన్స్ చాలానే ఉంటుంది .ఎన్నికల సమయం అంటే ఇంకా చెప్పనవసరం లేదు ము డబ్బును మంచినీళ్లులా ఖర్చు పెట్టాల్సిందే.
ఎన్నికల్లో ప్రత్యర్థులపై పై చేయి సాధించి విజయాన్ని దక్కించుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు సొమ్ములు వెచ్చించాల్సిందే.
ఇక ఎన్నికల సమయంలో అన్ని కుల సంఘాల నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారి కోరిన కోరికలన్నీ తీర్చితేనే ఫలితం ఉంటుంది.
అలా కాకుండా ఖర్చుకు వెనకాడితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలు పై ఉంటుందని బాగా తెలుసు.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ( Telangana Assembly Election )అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపుడు అవుతోందట.
ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో వనభోజనాలు కార్యక్రమం జోరుగా సాగుతోంది .దీంతో ఆయా పార్టీల అధిష్టానాలు కార్తీక వనభోజనాల( Karthika Vanabhojanalu ) విషయంలో అభ్యర్థులకు సూచనలు చేస్తున్నాయి.
"""/" /
భారీగా వన సమారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాయి. దీనికి తోడు ఆయా కుల సంఘాలు ఏర్పాటు చేసే వన సమారాదన( Vana Samaradana )కి అయ్యే ఖర్చును మాత్రం భరించాల్సిందిగా ఆయా పార్టీల అభ్యర్థులను కోరుతున్నాయి.
దీంతో అన్ని కుల సంఘాల వన సమారాధన లను తలుచుకుని అభ్యర్థులు లబోదిబోమంటున్నారు .
పార్టీ అధిష్టానం నుంచి ఈ మేరకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయని ఎదురుచూస్తున్నా, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించకపోవడం , అభ్యర్థుల సొంతంగా ఖర్చు పెట్టుకోవాలనే సూచనలు వస్తూ ఉండడంతో, లబోదిబో అంటున్నారు.
ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండడం, కార్తీక మాసం కావడంతో ఎవరిని కాదనలేక నాయకులు సతమతం అవుతున్నారట.
ఒక్కో కుల సంఘం కనీసం 10 లక్షలు కార్తీక వన సమారాధన నిమిత్తం డిమాండ్ చేస్తున్నారట.
"""/" /
దీంతో ప్రతి కుల సంఘానికి ఖర్చును భరించడం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారిందట.
అయితే ఈ ఎన్నికల్లో ఆయా కుల సంఘాల మద్దతు తమకు ఉండాలంటే కచ్చితంగా ఈ ఖర్చు విషయంలో వెనకాడకూడదని పార్టీల అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తుండడంతో బాధగానే ఆ ఖర్చులను భరిస్తున్నారట.
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?