షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు మరోసారి సీఎం కేసీఆర్ క్లారిటీ..!!

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ( KCR )ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు.ఇటీవల కొన్ని వార్తలు వస్తున్నాయి.

ఇటువంటి క్రమంలో నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు.ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాగా పనిచేయాలని స్పష్టం చేశారు.

BRS ప్రతినిధుల సమావేశంలో బాగా పనిచేసిన వారికే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో( Assembly Elections ) టికెట్ ఇవ్వడం జరుగుతుందని కరాకండిగా చెప్పారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

ఏది ఏమైనా ఈసారి మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించాలని కేసీఆర్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు సమాచారం.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.రెండుసార్లు కేసీఆర్ పార్టీ గెలవడం జరిగింది.

మూడోసారి జరగబోతున్న ఈసారి ఎన్నికలలో కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని.పైగా BRS పార్టీగా జాతీయ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో.

ఈ ఎన్నికలలో కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందట.గత నవంబర్ నెలలో కూడా ఇదే రీతిలో.

పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

మరోసారి నేడు సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని క్లారిటీ ఇవ్వటం జరిగింది.

పదేళ్లుగా ఆ వ్యక్తి ప్రేమలోనే… మొత్తానికి క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!