ఎన్నికల టీమ్స్ సమన్వయంతో లోక్ సభ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి: కలెక్టర్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:జిల్లాలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమర్థవంతంగా నిర్వహించేందుకు టీమ్స్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.
వెంకట్రావ్ ( Venkat Rao )సూచించారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లోక్ సభ ఎన్నికలు 2024 సందర్బంగా కలెక్టరేట్ లోని అన్ని శాఖల సిబ్బందికి ఎంసిసి, సి-విజిల్,సువిధ, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, మీడియా సెంటర్,ఈవీఎం మేనేజ్మెంట్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వటం జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు.
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.
సి సెక్షన్ ద్వారా ఎప్పటికప్పుడు ఈసిఐ వారి అప్డేట్స్ అన్ని శాఖలకు తెలపాలన్నారు.
పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్ లు,టాయిలెట్స్,కరెంట్, త్రాగునీరు లాంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.
సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్,ఏజెంట్స్ చేసే పనులు,పోలింగ్ సరళిని వెబ్ క్యాస్టింగ్ చేయాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ లో మూడు రకాలు ఉంటాయని,
ఫారం 12 ద్వారా ఎన్నికల సిబ్బంది,ఫారం 12 B ద్వారా 4 వ తరగతి సిబ్బంది (ఈడిసి)ఫారం 12 D ద్వారా 85 సంవత్సరాలు ఉన్న వయోవృద్దులు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉపయోగించుకోవాలనితెలిపారు.
ఎన్నికల ప్రకటన ప్రకటించిన రోజు నుండే ఎంసిసి అమలులో ఉంటుందని,సి-విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై 15 నిమిషాలలో స్పందించి ఫిర్యాదు అందిన ప్రదేశం కు 5 నిమిషాలలో ఎఫ్.
ఎస్.టి టీం వెళ్లాలని, ఎంసిసి కోడ్ ఉల్లంఘన అయితే ఫారం B8, అమౌంట్ సీజ్ విషయం అయితే ఫారం B9 ద్వారా ద్వారా సమాచారం అందించాలని తెలిపారు.
1950 కి కాల్ చేసి ఓటుకి సంబంధించిన విషయాలు పౌరులు తెలుసుకోవచ్చని, సువిధ యాప్ ( SUVIDHA )ద్వారా పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
ర్యాలీలు,రోడ్ షోలు,మీటింగ్ లలో డిజే సౌండ్స్ ఉపయోగించరాదని, పాఠశాలలు,దేవాలయాలు,మసీదులు,చర్చిల సమీపంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు.
తదుపరి అదనపు కలెక్టర్ (రెవిన్యూ)బి.ఎస్.
లత మాట్లాడుతూ ఈవిఎంలు 4 కేటగిరిలుగా ఉంటాయని,కేటగిరి A- ఈవిఎంలు పోలింగ్ అయినరోజు ఉపయోగిస్తారని,కేటగిరి B- ఈవిఎంలు పోలింగ్ మధ్యలో ఆగిపోయిన ఈవిఎంలు
కేటగిరి -A,కేటగిరి -B ఈవిఎంలు ఎస్కార్ట్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారన్నారు.
కేటగిరి C -ఈవిఎంలు మాక్ పోలింగ్ సమయంలో ఆగిపోయిన ఈవిఎంలు కేటగిరి D- ఈవిఎంలు రిజర్వ్ లో ఉంచుతారన్నారు.
కేటగిరి C,కేటగిరి D ఈవీఎంలు ప్రత్యేక స్ట్రాంగ్ రూములో ఉంచుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ ఎంటిలు విప్పర్ల రమేష్,సిహెచ్.
శ్రీనివాస రావు,ఏఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల పరివేక్షకులు శ్రీనివాసరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బొప్పాయి తో బరువు తగ్గొచ్చు.. ఎలాగో తెలుసా?