బీసీ లే లక్ష్యంగా జగన్ ఎన్నికల వ్యూహాలు

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మెజార్టీ సీట్లను సాధించి మళ్లీ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత,  ఏపీ సీఎం జగన్ దానికి అనుగుణంగానే వ్యవహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  ముఖ్యంగా ఏపీలో బీసీ సామాజిక వర్గం మద్దతు తనుకు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఎప్పుడూ లేనివిధంగా మిగతా పార్టీల కంటే ఎక్కువగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన వైసిపి ఇప్పుడు మరింతగా వారికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది .

2024 ఎన్నికల్లో బీసీలు ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు.

ఈ మేరకు జంగా కృష్ణమూర్తి( Janga Krishna Murthy ) ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు .

  ఈ ప్యానల్ లో ముగ్గురు ఉపాధ్యక్షులు ,ఎనిమిది మంది జోనల్ ఇన్చార్జీలు,  ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, 15 మంది కార్యదర్శులు ,పదిమంది సంయుక్త కార్యదర్లుశులు  ఉంటారు.

గత ఎన్నికల్లో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బీసీ నేతలతో కలిసి పార్టీ బీసీ డిక్లరేషన్ ను రూపొందించారు .

"""/" /  టిడిపికి ప్రధాన మద్దతు దారులుగా ఉన్న బీసీలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో సక్సెస్ అయ్యారు.

ఆ వ్యూహం తోనే బీసీలకు జగన్ మంత్రివర్గం( YS Jagan )లో ఎక్కువ స్థానాలు కల్పించారు .

ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు , అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చారు.కొత్తగా ఏర్పాటు చేసిన వైసీపీ బీసీ సెల్ కమిటీ వివరాలు ఒకసారి పరిశీలిస్తే .

"""/" / జంగా కృష్ణమూర్తి తో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులుగా డోలా జగన్ , కాండ్రు కమల(kandru Kamala ),  హరిప్రసాద్ ఇన్చార్జీలుగా .

జోన్ వన్ ధర్మాన కృష్ణ చైతన్య, జోన్ 2 చంద్రశేఖర రావు , జోన్ 3 అల్లి రాజబాబు , జోన్ 4 కాసగోని దుర్గారావు గౌడ్ , జోన్ 5 బొట్ల రామారావు ,జోన్ సిక్స్ తోడమల్ల పుల్లయ్య,  జోన్ 6 అనంతపురం నుంచి గొల్ల నాగరాజు యాదవ్ Lanu నియమించారు.

రాబోయే ఎన్నికల్లో ఏపీవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బీసీలు ఉండడంతో వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలు పంపించేందుకు వైసిపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

బీసీలు పార్టీకి వెన్నుముక అనే సంకేతాలను వైసిపి ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

కాంగ్రెస్ తో మేము పనిచేసే ఉంటే నీకు చిప్పకూడే