తెలంగాణలో అక్టోబర్ 6 లేదా 7న ఎన్నికల షెడ్యూల్…?

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ( Assembly Elections )హడావుడి మొదలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 6 లేదా7న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని,డిసెంబర్ 7న పోలింగ్,11న కౌంటింగ్ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

అక్టోబర్ 3న సీఈసీ బృందం హైదరాబాద్ చేరుకొని,అదే రోజు రాజకీయ పార్టీలతో భేటీ నిర్వహించి,4న అధికారులతో సన్నద్ధతపై సమీక్ష జరపనునట్లు తెలుస్తోంది.

అందులో భాగంగానే ఓటర్లు తుదిజాబితా కూడా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నా కూతురు కూడా అలాగే పెరగాలి.. వైరల్ అవుతున్న ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు!