తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి..!

తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపటి నుంచి ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థుల నుంచి కమలం పార్టీ దరఖాస్తులు స్వీకరించనుంది.

రేపటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.

ఈ క్రమంలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుండగా ఇందుకోసం ప్రత్యేక సెల్ ను బీజేపీ నేతలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.

అదేవిధంగా దరఖాస్తులకు ఎలాంటి రుసుము లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆశావహుల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అదేవిధంగా దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీ నియామకం అయింది.ఈ క్రమంలో ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనుందని సమాచారం.

చీక‌ట్లో మొబైల్ వాడ‌టం వ‌ల్ల ఎన్ని న‌ష్టాలో తెలుసా?